అబ్బో “గుంటూరు కారం” కదిలేలా లేదుగా.!

ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ లో అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా ఒకటి. మరి ఈ భారీ చిత్రం షూటింగ్ ఇప్పుడు ఆల్రెడీ కొనసాగుతూ ఉండగా మహేష్ మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండానే సినిమా చేస్తున్నాడు.

అలాగే మేకర్స్ కూడా నెమ్మదిగానే సినిమా షూట్ చేస్తుండగా ఇప్పుడు సినిమాపై అయితే ఇంకో అప్డేట్ తెలుస్తుంది. దాదాపు ఏడాది నుంచి షూటింగ్ జరుగుతున్నా ఈ సినిమా అయితే ఇప్పుడు చాలా ఎక్కువ రోజులు షూట్ జరుపుకోవాల్సి ఉందట.

ఆల్రెడీ షూటింగ్ చేసిన కొన్ని సీన్స్ ని స్క్రాప్ లో వేసేయగా ఇంకా నెక్స్ట్ ఈ సినిమాలో షూటింగ్ భారీ మొత్తంలో బాలన్స్ ఉందట. కాగా లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే దాదాపు 80 రోజులకి పైగానే ఇంకా సినిమా షూటింగ్ బాలన్స్ ఉందట. ఇది మాత్రం తక్కువ సమయం అయితే కాదని చెప్పాలి.

ప్రస్తుతానికి అంచనా 80 రోజులు అయితే ఇక ముందు రోజులు ఇది మరింత ఆలస్యం అయ్యినా ఆశ్చర్యం లేదు. దీనితో కేవలం షూటింగ్ కె మూడు నెలలు పోతే ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూస్తే అబ్బో చాలానే పని ఉందని చెప్పాలి. మరి ఇవన్నీ కంప్లీట్ చేసి “గుంటూరు కారం” అయితే వచ్చే సంక్రాంతి కి రానుంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల లు అయితే హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.