సమంతతోనే గుణశేఖర్ ఇంకోస్సారి.?

‘శాకుంతలం’ సినిమాని సమంతతో తెరకెక్కించి, దాన్ని విడుదల చేసుకోవడానికి దర్శక నిర్మాత గుణశేఖర్ నానా తంటాలూ పడుతున్నాడు. భారీగా సినిమాలు తెరకెక్కించడం, విడుదల చేసుకోలేక ఇబ్బందులు పడటం గుణశేఖర్‌కి కొత్తేమీ కాదు.

ఇదిలా వుంటే, గుణశేఖర్ తదుపరి సినిమా ఓ కమర్షియల్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. అయితే, అది కూడా హీరోయిన్ సెంట్రిక్ మూవీయేనట. పైగా, ఆ సినిమా కోసం ఆల్రెడీ సమంత దగ్గర ‘మాట’ తీసుకున్నాడట గుణశేఖర్.

ఎక్కువ టైమ్ తీసుకోకుండా, వేగంగానే సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడట గుణశేఖర్. సమంత గనుక తగినన్ని డేట్స్ ఇవ్వగలిగితే, ఈ ఏడాదే ఆ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుందని గుణశేఖర్ ఆయన సన్నిహితుల వద్ద చెబుతున్నాడట. కానీ, సమంత ఇప్పుడు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలానే వున్నాయ్. సో, గుణశేఖర్ కాస్త వేచి చూడక తప్పదు.