రాఖీ బాయ్ ఇంట్లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు… వైరల్ అవుతున్న క్యూట్ ఫొటోస్?

రక్షాబంధన్ సందర్భంగా సామాన్యులు సెలబ్రిటీలు అని తేడా లేకుండా అందరూ తమ సోదరులకు రాఖీ కట్టి వారి మధ్య ఉన్న ప్రేమానుబంధాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు కూడా రాఖీ పండుగని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కన్నడ హీరో యశ్ ఇంట్లో కూడా రాఖీ పండుగ సెలబ్రేషన్స్ జరిగాయి. రాఖీ పౌర్ణమి రోజున యశ్ సోదరి యశ్‌కు రాకీ కట్టారు. ఈ క్రమంలో యశ్ పిల్లలు కూడా ఈ రక్షా బంధన్ ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. యశ్ కూతురు కూడా తన సోదరుడికి రాఖీ కట్టి లడ్డు తినిపించింది. యశ్ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా యశ్ అభిమానులతో పంచుకున్నాడు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో యశ్ కూతురు, కొడుకు చాలా క్యూట్ గా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యష్ తన భార్య పిల్లలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. దీంతో మీరు కూడా బాగా ఫేమస్ అయ్యారు. ఇదిలా ఉండగా టీవీ నటుడిగా తన సినీ జీవితం ప్రారంభించిన తర్వాత హీరోగా మారి ఎన్నో సినిమాలలో నటించాడు. ఈ క్రమంలో ప్రశాంతని దర్శకత్వంలో తరికెక్కిన కేజిఎఫ్ సినిమా ద్వారా స్టార్ హీరోగా మారిపోయాడు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజిఎఫ్ సినిమా సౌత్ ఇండస్ట్రీలో మంచి హిట్ సొంతం చేసుకుంది.

ఆ సినిమా హిట్ అవడంతో దానికి సీక్వల్ గా కేజిఎఫ్ 2 సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే రూ. 1200 కోట్ల గ్రాస్ క్లబ్బులోచేరి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. వసూళ్ల విషయంలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ని కూడా వెనక్కి నెట్టి ఓవరాల్‌గా భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బాహుబలి 2 తర్వాత స్థానంలో నిలిచింది. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన యశ్ తన తర్వాతి సినిమాలపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.