గాసిప్స్ : విజయ్ కోసం పవన్ తో ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.??

Dil raju

తన సినిమాని ఎలాంటి పరిస్థితుల్లో అయితే సినిమా ఆడియెన్స్ లోకి తీసుకెళ్లడంలో నిర్మాత దిల్ రాజు దిట్ట అని చాలా మందికి తెలుసు. అప్పటివరకు నెగిటివ్ ఉన్న సినిమాకి కూడా లాస్ట్ లో పాజిటివ్ గా మార్చే సత్తా దిల్ రాజుకి ఉండగా ఇప్పుడు కూడా అలంటి ప్లాన్ నే నెక్స్ట్ భారీ సినిమాకి చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో పలు రూమర్స్ ఇపుడు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు తాను నిర్మాతగా దర్శకుడు వంశీ పైడిపల్లి మరియు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో “వారసుడు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే తమిళ్ లో భారీ అంచనాలు నెలకొల్పుకుంది అలాగే తెలుగు రిలీజ్ కూడా దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా కొన్ని కాంట్రవర్సీ లు కూడా ఈ సినిమా తెలుగు రిలీజ్ పై నడుస్తున్నాయి.

మరి వీటికి చెక్ పెట్టేలా అదిరే ప్లాన్ ని దిల్ రాజు చేసినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ వేడుకకి గాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ముఖ్య అతిధిగా హాజరయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ సినీ వర్గాల్లో ఇప్పుడు గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. మరి ఇది విన్న వారు అయితే ఇది డెఫినెట్ గా దిల్ రాజు ప్లాన్ అయ్యి ఉంటుంది అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాని ఫ్యాన్స్ లో షేక్ చేసి పారేస్తోంది.