గాసిప్స్ : మరోసారి బన్నీ సమంత రెచ్చిపోనున్నారా??

ఇపుడు పాన్ ఇండియా మార్కెట్ లో మాసివ్ హైప్ లో ఉన్న భారీ చిత్రాల్లో అయితే అయితే టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో బిగ్గెస్ట్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కూడా ఒకటి. మరి ఈ భారీ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాని గత పుష్ప 2 లా కాకుండా చాలా గ్రాండ్ మ్యానర్ లో నెక్స్ట్ లెవెల్లో అయితే ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా కోసం అంతా వెయిట్ చేస్తుండగా రీసెంట్ గానే కొని ఎగ్జైటింగ్ వార్తలు కూడా బయటకి వచ్చాయి. మరి వాటితో పాటుగా సినిమాలో ఐటెం సాంగ్ కోసం మళ్ళీ కొన్ని రూమర్స్ వైరల్ గా మారాయి. ఇప్పటికే పుష్ప 1 లో స్టార్ హీరోయిన్ సమంత తో ఓ ఊహించని హాట్ సాంగ్ ని ప్లాన్ చేయగా ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2 లో కూడా ఈ క్రేజీ సాంగ్ ని అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో ఈ చిత్రంలో కూడా మళ్ళీ అల్లు అర్జున్ మరియు సమంత లు అయితే మళ్ళీ కలిసి కాలు కడపనున్నారని అంటున్నారు. మరి అంటే మరి పుష్ప 1 నుంచి మళ్ళీ సమంతని పుష్ప రాజ్ కోసం తీసుకురాబోతున్నారని చెప్పాలి. ఆల్రెడీ ఆ సాంగ్ లో ఇద్దరు కలిసి చేసిన రచ్చ ఏ లెవెల్లో ఉందో అందరికీ తెలిసిందే.

మరి ఈసారి కూడా కన్ఫామ్ అయితే సుకుమార్ మరింత ఘాటుగా ఈ సాంగ్ ని ప్లాన్ చేస్తాడని చెప్పాలి అసలే అల్లు అర్జున్ సుకుమార్ మరియు దేవిశ్రీ ప్రసాద్ ల కాంబినేషన్ లో ఐటెం సాంగ్ అంటే అదొక ట్రాక్ రికార్డు ఉంది. మరి ఇది మళ్ళీ కొనసాగుతుందేమో చూడాలి.