గోపీచంద్ రామబాణం… భారీగా థియేట్రికల్ బిజినెస్!

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం ఒక బిగ్గెస్ట్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది పక్కా కమర్షియల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా గోపీచంద్ కు లాభం లేకపోయింది. దీంతో తనకు ఇండస్ట్రీలో హిట్లు ఇచ్చి స్టార్ హీరోగా నిలబెట్టిన డైరెక్టర్ శ్రీవాస్ నే గోపీచంద్ నమ్ముకున్నాడు. లక్ష్యం, లౌక్యం వంటి సినిమాలతో హిట్ కాంబో అనిపించుకున్న గోపీచంద్- శ్రీవాస్ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యారు.

వీరిద్దరి కాంబోలో వస్తున్న తాజాగా చిత్రం రామబాణం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ఖిలాడీ బ్యూటీ డింపుల్ హయతి నటిస్తుండగా జగపతి బాబు, కుష్బూ ప్రధానపాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక గోపీచంద్ శ్రీవాస్ కాంబోలో తెరకెక్కుతున్న రామ బాణం సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ పెరుగిపోతుంది. గోపి చంద్ సక్సెస్ చూసి 9 ఏళ్లు అయినా… హిట్ కాంబినేషన్ కు డిమాండ్ పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ భారీగా చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 20 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినట్లు సమాచారం.

ఇక లక్ష్యం, లౌక్యం సినిమాలలో లానే ఈ సినిమాలో కూడా గోపీచంద్ యాక్షన్ తో అదరగొట్టనున్నట్లు టీజర్ చూస్తే ఇప్పటికే అర్థం అయ్యింది. ఈ చిత్రంలో విక్కీ అనే పాత్రలో గోపీచంద్ కనిపించనున్నారు. ఇదో మాస్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కినట్లు కనిపిస్తుంది. మరోపక్క మొదటి నుంచి గోపీచంద్ సెంటిమెంట్ టైటిల్ లో చివరి అక్షరం సున్నా ఉంటే అది హిట్.. ఈ విషయం తెల్సిన బాలయ్య.. అన్ స్టాపబుల్ కు వచ్చిన గోపీచంద్ కు రామ బాణం అనే టైటిల్ ను సజిస్ట్ చేయడం.. దాన్నే గోపీచంద్ సీరియస్ గా తీసుకొని టైటిల్ గా పెట్టేశాడు. మరి ఈసారైనా ఈ రామబాణం ప్రేక్షకులకు గుచ్చుకుంటుందా..? గోపీచంద్ హిట్ అందుకుంటాడా..? ఈ కాంబో హ్యాట్రిక్ కొడుతుందా..? అనేది సినిమా రిలీజ్ అయ్యాక చూడాల్సిందే.