చక్కగా పెళ్ళి చేసుకోబుతున్నారు కదా ఈ ఆస్తి గోలెందుకు ..?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్ళి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 30 న ముంబై లోని ఒక స్టార్ హోటల్ లో కాజల్ పెళ్ళి రెండు రోజుల వేడుకగా అంగరంగ వైభంగా జరగబోతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన కూడా స్వయంగా కాజల్ వెల్లడించింది. దాదాపు సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో 13 ఏళ్ళకి పైగా సక్సస్ ఫుల్ కెరీర్ ని లీడ్ చేస్తున్న కాజల్ ప్రేమించి పెళ్ళి చేసుకోబోతుంది.

Kajal Aggarwal to debut on Netflix with a web series

గత కొంతకాలంగా ముంబై లోని వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు తో ప్రేమలో ఉంది. అయితే ఇంతకాలం కాజల్ పెళ్ళికి సంబంధించి రక రకాల వార్తలు వచ్చినప్పటికి పెద్దగా స్పందించకుండా కెరీర్ మీదే దృష్ఠి పెట్టింది. అయితే పెద్దల మాట ప్రకారం కాజల్ పెళ్ళికి సిద్దమైంది. ఇక కాజల్ ఎప్పుడైతే తన పెళ్ళి విషయాన్ని అధికారకంగా వెల్లడించిందో అప్పటి నుంచి అందరూ గౌతమ్ గురించి ఎంక్వైరీ చేయడం ప్రారంభించారు.

Kajal Aggarwal to Marry businessman Gautam Kitchlu? Wiki, Bio, Marriage  Date Pics Images

కాజల్ – గౌతమ్ ల పరిచయం ఎలా మొదలైంది.. ఎంతకాలంగా ప్రేమలో ఉన్నారు.. వీరి ప్రేమకి కారకులు ఎవరైనా ఉన్నారా .. ఇలా అన్నీ కోణాలలో విషయాలు తెలుసుకునేందుకు కొంతమంది ఉబలాటపడుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా కాజల్ – గౌతమ్ లలో ఎవరి ఆస్తి ఎక్కువ అన్న చర్చలు మొదలయ్యాయి. కాగా కాజల్ ఇండస్ట్రీకొచ్చిన ఇన్ని సంవత్సరాలలో యావరేజ్ గా సినిమాల పరంగా చూస్తే ఒక సంవత్సరానికి 5 కోట్ల ఆదాయం ఉంటుందని అంచనా వేస్తున్నారట. ఆ రకంగా కాజల్ బాగానే ఆస్థులని కూడ బెట్టిందని చెప్పుకుంటున్నారు.

ఇక కమర్షియల్ యాడ్స్ .. ఇతర వ్యాపారలు సపరేట్. ఇక గౌతమ్ ఆస్థులు ప్రస్తుతం 50 కోట్ల వరకు ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని గురించి ఇప్పుడు చర్చించికోవడం అవసరమా అంటున్నారట. నిజమే కదా చక్కగా పెళ్ళి చేసుకోబోతున్న సమయంలో ఈ ఆస్థుల గురించి చర్చలెందుకు.