చిరు “గాడ్ ఫాదర్” కి మొట్ట మొదటిసారి టీఆర్పీ రేటింగ్ ఇదే.!

గత ఏడాదిలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నుంచి అయితే బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. మరి వాటిలో భారీ అంచనాలు మధ్య వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం ఘోరమైన ప్లాప్ గా నిలవగా నెక్స్ట్ అయితే దర్శకుడు మోహన రాజా తో వచ్చిన రీమేక్ చిత్రం “గాడ్ ఫాదర్” కూడా ఒకటి.

అయితే ఈ చిత్రం ఆచార్య తో పోలిస్తే పర్వాలేదు అనిపించి యావరేజ్ గా మాత్రమే నిలిచింది కానీ మెగాస్టార్ రేంజ్ హిట్ అయితే కాలేదు. అయినప్పటికీ సుమారు 130 నుంచి 140 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టుగా హీరో నిర్మాత రామ్ చరణ్ వెల్లడించాడు. అయితే ఈ సినిమా మొదటిసారిగా టెలివిజన్ స్క్రీన్ పై సంక్రాంతి కానుకగా టెలికాస్ట్ కాగా ఈ రేటింగ్ అయితే ఇప్పుడు బయటకి వచ్చింది.

మరి ఈ సినిమా ఫస్ట్ టెలికాస్ట్ లో ఏమంత గొప్ప టీఆర్పీ అయితే అందుకోలేదు. ఇది కేవలం 7.69 మాత్రమే అందుకుంది. కాకపోతే ఆచార్య కంటే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే చిరు యావరేజ్ సినిమాకి యావరేజ్ రేటింగ్ నే ఆడియెన్స్ ఇచ్చారు.

కానీ ఇదే సంక్రాంతికి మెగాస్టార్ వాల్తేరు వీరయ్య కి థియేటర్స్ లో భారీ వసూళ్లు అందించారు. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ లో నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే సత్యదేవ్ సహా నయనతార తదితరులు నటించారు.