Mahesh Vitta: ప్రస్తుతం ఓటిటి లో ప్రసారమౌతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే బిగ్ బాస్ 5 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇతర భాషలలో బిగ్ బాస్ రియాలిటీ షో ని ఓటిటి ప్రసారం చేయటం వల్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువల్ల తెలుగు బిగ్ బాస్ ని కూడా ఈసారి ఓ టి టి లో ప్రసారం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ రియాలిటీ షో ప్రేక్షకుల నుండి మిశ్రమ ఫలితాలు అందుకుంటోంది. ఈ సీజన్ మొదలై ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకుంది. 17 మంది కంటెస్టెంట్ ల తో ప్రారంభమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో లో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్ లు మాత్రమే ఉన్నారు.
ఆదివారం వచ్చిందంటే ఈ షో చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతారు. ఆదివారం రోజు ఎలిమినేషన్ ప్రక్రియ ఉండటంతో బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది తెలుసుకోవటానికి ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే గత వారం మహేష్ విట్టా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. ఇంటి సభ్యులు హౌస్ నుండి ఎలిమినేట్ అయినప్పుడు ఎంతో బాధ పడుతూ వస్తారు. కానీ మహేష్ మాత్రం చాలా నార్మల్ గా ఉన్నాడు. మహేష్ గత వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పాడు.
రాహుల్ సిప్లిగంజ్ – మహేష్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ఈ సందర్భంగా మహేష్ తెలియజేశాడు.బిగ్ బాస్ సీజన్ త్రీ లో మహేష్ విట్టా, రాహుల్ సిప్లిగంజ్ కలిసి పాటిస్పేట్ చేశారు. కానీ ఆ సమయంలో వారిద్దరి మధ్య బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉండేది కాదు. బిగ్ బాస్ సీజన్ త్రీ లో మహేష్ ఎలిమినేట్ అయినప్పుడు రాహుల్ గురించి చెప్తూ ” తను ఏం అన్నా నాకు కోపం వచ్చేది కాదు. మా ఇద్దరి మధ్య అన్నతమ్ముల అనుబంధం ఉంది ” అని మహేష్ చెప్పాడు.
మహేష్ తన సంపాదన మాత్రమే కాకుండ 50 లక్షల రూపాయలు అప్పు చేసి మరి సినిమా తీస్తున్నాడు. అందుకు రాహుల్ సిప్లిగంజ్ మహేష్ కి చాలా సపోర్ట్ చేశాడు. సినిమాకి సంబంధించిన మ్యూజిక్ వర్క్ మొత్తం రాహుల్ దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. రాహుల్ నాకు ఒక అన్న మాదిరి అని చెప్పుకొచ్చాడు. సినిమా కోసం చేసిన 50 లక్షల రూపాయలు అప్పు చెల్లించడానికి నేను బిగ్ బాస్ కి వచ్చానని మహేష్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ సినిమా ప్లాప్ అయినా కూడా రిస్క్ ఉండకూడని బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేశానని ఈ సందర్భంగా తెలియజేశాడు.