Ghani Trailer : ‘గని’ ట్రైలర్ టాక్ : వరుణ్ లోని కొత్త కోణంతో ఏక్షన్ ప్యాకెడ్ ఎమోషనల్ డ్రామాగా.. 

Ghani Trailer : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా “గని” కూడా ఒకటి. ఎప్పుడో షూటింగ్ పూర్తయ్యి రిలీజ్ కావాలిన ఈ సినిమా అనేక సార్లు వాయిదాలు పడుతూ వచ్చింది. కానీ ఫైనల్ గా రానున్న ఏప్రిల్ 8న రిలీజ్ కి ఫిక్స్ చేసారు.
ఇప్పుడు ఇది ఫైనల్ కాగా సినిమా నుంచి ఫైనల్ ట్రీట్ ఇచ్చేలా ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. మొదట వరుణ్ తేజ్ కోసం విషయానికి వస్తే తాను మాత్రం తన సినిమాల్లో ఏ సినిమాకి లేని విధంగా సిద్ధం అయ్యాడని చెప్పాలి.
ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ బాడీ లో కనిపించి అదరగొట్టగా అంతకు మించి అదిరే యాటిట్యూడ్ లో గని గా కనిపిస్తున్నాడు. అలాగే ఇంకోపక్క హీరోయిన్ సాయి మంజ్రేకర్ కి కూడా మంచి పాత్ర ఇందులో కనిపిస్తుంది. కానీ ఇదిలా ఉండగా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయని చెప్పాలి.
నటి నదియా వరుణ్ కి అమ్మగా తన దగ్గర మాట తీసుకోవడం అలాగే నటులు సునీల్ శెట్టి మరియు ఉపేంద్ర పాత్రలు కూడా మంచి పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. అలాగే అసలు ఈ సినిమా మెయిన్ బ్యాక్ డ్రాప్ బాక్సింగ్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయనిపిస్తోంది.
మంచి ఏక్షన్ సీక్వెన్స్ లతో ఏక్షన్ మూవీ లవర్స్ ని మెయిన్ గా టార్గెట్ చేస్తూ కనిపిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఈ ట్రైలర్ ఇప్పుడు ఆకట్టుకుంటుంది. మరి కంప్లీట్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి అల్లు బాబీ మరియు సిద్ధూ ముద్ద లు నిర్మాణం వహించగా థమన్ సంగీతం సమకూర్చాడు.
https://www.youtube.com/watch?v=GhMVQwp8PYs