Varun Tej : భారీ మొత్తానికి గని డిజిటల్ రైట్స్…. అంచనాలు పెంచుతున్న మెగా ప్రిన్స్…!

Varun Tej:మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు వరుణ్ తేజ్ కూడా ఒకరు. కానీ విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వరుణ్ తేజ్ నటించిన చిత్రం గని, దానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది కానీ కొన్ని కారణాల వల్ల విడుదలకు ఆలస్యం అవుతూ వస్తోంది. మొత్తానికి ఏప్రిల్ 8న ఈచిత్రం విడుదల నిర్ణయించారు.అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ చిత్రానికి నిర్మాత. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా నటిస్తోంది. ఏ సినిమా స్పోర్ట్స్ డ్రామా డ్రామా గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక బాక్సర్ గా కనిపించనున్నారు.కిరణ్ కొర్రపాటి ఈ సినిమాని తెరకెక్కించనున్నారు.

ఏప్రిల్ 8న ఈచిత్రం విడుదల ఉండటంతో ప్రమోషన్ లో భాగంగా నేను ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు.బాక్సింగ్ పంచ్ లాగే ట్రైలర్ సాలిడ్ గా, ప్రామిసింగ్ గా ఉంది. ట్రైలర్ లో యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ అన్ని పర్ఫెక్ట్ గా మిక్స్ అయ్యాయి. ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. తాజాగా ఈ సినిమా అన్ని భాషల ఓటిటి, శాటిలైట్ రైట్స్ 25 కోట్లకు అమ్ముడయ్యాయి. కేవలం ట్రైలర్ మాత్రమే చూసి ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది.

సినిమాను అద్భుతంగా ఉంటుందని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఈ సినిమాలో బాక్సర్ గా కనిపించడం కోసం వరుణ్ చాలా కష్టపడ్డాడు. బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు వరుణ్. వరుణ్ తేజ్ సినిమా లోనే ఎక్కువ బడ్జెట్ తో తీసిన సినిమా ఇదే అందులోనూ ఎక్కువ మొత్తానికి శాటిలైట్ రైట్ లు అమ్ముడుపోయిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ అనిపిస్తుందా వేచి చూడాలి.