గంగవ్వ ఆర్మీ.. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం.. అవ్వను గెలిపించాలంటూ రిక్వెస్ట్

gangavva fans creating sensation on social media

బిగ్ బాస్ 4 స్టార్ట్ అయి అప్పుడే రెండు రోజులు అయింది. గత నెల 30నే ప్రారంభం కావాల్సిన షో.. కరోనా కరణంగా వారం తర్వాత సెప్టెంబర్ 6న ప్రారంభం అయింది. ఇప్పటికే తొలి రోజు హౌస్ లో గొడవతో ముగిసింది. కరాటే కళ్యాణి, సుజాత మధ్య ఓ గొడవ, మరోవైపు సూర్య కిరణ్, మొనల్ గజ్జర్ మధ్య మరో గొడవ.. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యులంతా సెట్ అయిపోయినట్టే ఇక.

gangavva fans creating sensation on social media
gangavva fans creating sensation on social media

ఈ హౌస్ లో ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో 14 మంది హౌస్ లో ఉన్నా… ఇద్దరు మాత్రం సీక్రెట్ రూంలో ఉన్నారు. సయ్యద్ సొహైల్, అరియానా గ్లోరీ.. ఇద్దరు సీక్రెట్ రూంలో ఉంటూ బిగ్ బాస్ హౌస్ లో మిగితా 14 మంది కంటెస్టెంట్లు ఏం చేస్తున్నారా? అని చూస్తున్నారు.

ఇక ఈ హౌస్ లో ఎవరైనా ఫేవరేట్ కంటెస్టెంట్ ఉన్నారా? అంటే మాత్రం ఖచ్చితంగా గంగవ్వే అని చెప్పాలి. ఈ వయసులో తను బిగ్ బాస్ హౌస్ కు చేరిందంటే మాటలు కాదు. అది పెద్ద విజయం. తనను ఎంతోమంది ఆదర్శంగా తీసుకోవచ్చు.

ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని నాగ్ కూడా కంటెస్టెంట్లను హెచ్చరించారు. గంగవ్వ స్పెషల్ కంటెస్టెంట్ అని అందుకే తనను చివరలో స్టేజీ మీదికి తీసుకొచ్చారు. చెప్పినట్టుగానే అందరూ గంగవ్వను బాగానే చూసుకుంటున్నారు.

ఇక.. బయట కూడా గంగవ్వకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. మై విలేజ్ షో యూట్యూబ్ చానెల్ ద్వారా తను తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఇక గంగవ్వ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిందో.. వెంటనే గంగవ్వ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గంగవ్వ ఆర్మీ పేరుతో పేజీలు, గ్రూపులు ప్రారంభించారు.

ఈసారి ఎలాగైనా బిగ్ బాస్ 4 విజేతగా గంగవ్వను గెలిపించాలంటూ బిగ్ బాస్ ప్రేక్షకులను గంగవ్వ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకోసం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఇప్పటికే గంగవ్వ మొదటి వారం నామినేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సోమవారం రాత్రి నుంచే గంగవ్వకు ఓట్లు వేసి సేవ్ చేయాలని.. అలాగే గంగవ్వను బిగ్ బాస్ విజేతగా నిలపాలంటూ పోస్టులు పెడుతున్నారు.

ఈ హడావుడి అంతా చూస్తుంటే నిజంగానే గంగవ్వ బిగ్ బాస్ విజేతగా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. అంటున్నారు నెటిజన్లు.

Elimination process lo #Gangavva Mass!!! 😎 🔥 #BiggBossTelugu4 Today at 9:30 PM on #StarMaa

Monday morning fun tho start aindi..Rojantha ilane untunda?? #BiggBossTelugu4 Today at 9:30 PM