హమ్మయ్య.. మహాసముద్రం సినిమాకు హీరోయిన్ దొరికేసింది.. ఆ హీరోయిన్ ఇక ఫిక్స్ అంటున్న అజయ్ భూపతి

Gang leader heroine priyanka arul mohan to act in ajay bhupati mahasamudram movie

ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్టో అందరికీ తెలుసు. చిన్న సినిమాగా విడుదలయి సంచలనాలను సృష్టించింది ఆ సినిమా. ఆ సినిమా హిట్ తో డైరెక్టర్ అజయ్ భూపతి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ సినిమా కంటే ముందు ఆర్జీవీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అజయ్.. ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు.

Gang leader heroine priyanka arul mohan to act in ajay bhupati mahasamudram movie
Gang leader heroine priyanka arul mohan to act in ajay bhupati mahasamudram movie

ఆర్ఎక్స్ 100 సినిమా సూపర్ హిట్ అయినా కూడా వెంటనే మరో సినిమాను ప్రకటించలేదు అజయ్. తన తదుపరి సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆయన డైరెక్షన్ లో పనిచేయడానికి చాలామంది హీరోలు రెడీగా ఉన్నా.. అజయ్ మాత్రం చాలా సెలెక్టివ్ గా వెళతారు.

ఆయన ఈమధ్యనే స్క్రిప్ట్ రెడీ చేసుకొని మహాసముద్రం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఆ సినిమాలో శర్వానంద్ హీరో. సిద్ధార్థ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత.

అయితే.. ఈ సినిమాకు హీరోయిన్ ను సెలెక్ట్ చేయడం అజయ్ కి తల ప్రాణం తోకకు వచ్చినంత పని అయిందట. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంత, అదితిరావు హైదరి, సాయిపల్లవిని అనుకున్నప్పటికీ.. తాజాగా మరోపేరు వినిపిస్తోంది.

ఆమె ఎవరో కాదు.. నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించిన ప్రియాంక అరుళ్ మోహన్. అజయ్.. ఇక ప్రియాంకనే ఈ సినిమా కోసం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Gang leader heroine priyanka arul mohan to act in ajay bhupati mahasamudram movie
Gang leader heroine priyanka arul mohan to act in ajay bhupati mahasamudram movie

ప్రియాంక మోహన్ ప్రస్తుతం శర్వానంద్ తోనే శ్రీకారం అనే సినిమాలో నటిస్తోంది. అదే జోడీ మళ్లీ మహాసముద్రంలో నటించబోతోంది.

ఈ సినిమాలో నటించేందుకు తను ఒప్పుకున్నదని… అధికార ప్రకటన కూడా త్వరలోనే వెలువడుతుందని అంటున్నారు. అయితే.. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది ఈ సినిమా.