“గేమ్ చేంజర్” ఊహించని లీక్.. చిత్ర యూనిట్ అందరికీ షాక్..!

ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా నుంచి గ్రాండ్ గా తెరకెక్కుతూ పాన్ ఇండియా సినిమా దగ్గర గ్రాండ్ గా తెరకెక్కుతూ మ్యాజిక్ చేయనున్న పలు భారీ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఇండియాస్ టాప్ దర్శకుల్లో ఒకరైన శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “గేమ్ చేంజర్” కూడా ఒకటి.

మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఏంటి ఇతర వివరాలు కానీ సినిమా నుంచి సరైన అప్డేట్ కూడా  ఇప్పటివరకు రాలేదు. కాగా దీనితో విస్తుపోయి ఉన్న ఫాన్స్ సహా చిత్ర యూనిట్ అందరికీ నిన్న రాత్రి ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అయ్యింది. అయితే ఈ సినిమా సాంగే అంటూ ఓ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

సంగీత దర్శకుడు థమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ గేమ్ చేంజర్ లోనిదే అంటూ కొందరు పి ఆర్ లు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక ఏముంది ఓ రేంజ్ లో సాంగ్ అయితే స్ప్రెడ్ అయిపొయింది. దీనితో ఈ ఊహించని ట్విస్ట్ తో మేకర్స్ తలలు పట్టుకున్నారు. కాగా ఇప్పుడు ఈ భారీ సినిమా సాంగ్ లీక్ ని కప్పి పుచ్చడానికి ఇది అసలు సాంగ్ కాదని వేరే వెర్షన్ కూడా ఉందని అంటున్నారు.

కానీ ఇవి పై పై మాటలే తప్ప ఇంకొకటి లేదు. ఆల్రెడీ సాంగ్ అయితే చాలా క్లారిటీ గా ఉన్నదే లీక్ అయ్యిపోయింది. మళ్ళీ ఇంకా ఇందులో వెర్షన్ అంటే నమ్మేలా లేదు. మొత్తానికి అయితే శంకర్ సినిమా నుంచి ఇలాంటి లీక్ అంటే చాలా మందికి నమ్మశక్యంగా కూడా లేదు.