మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల దిల్ రాజు సైతం శంకర్ విషయంలో పెద్దగా ఇన్వాల్వ్ కావడం లేదు అని క్లారిటీ వచ్చేసింది. ఒక విధంగా ఇండియన్ 2 సినిమా కారణంగానే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.
శంకర్ రెండు వైపులా బ్యాలెన్స్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల విడుదల విషయంలో మరొకటి ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు టాక్. అసలైతే మొదట ప్లాన్ ప్రకారం ఇండియన్ 2 సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. లేదంటే సమ్మర్ కు షిఫ్ట్ చేయాలని అనుకున్నారు.
ఇక ఆ సినిమా రిలీజ్ ను బట్టి దర్శకుడు శంకర్ గేమ్ చెంజర్ సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేయాలని అనుకున్నాడు. కుదిరితే సమ్మర్లో లేదా వచ్చే ఏడాది దసరాకు విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇండియన్ 2 కంటే ముందుగానే గేమ్ ఛేంజర్ సినిమా సమ్మర్ కి వచ్చే అవకాశం ఉందట.
ఎందుకంటే ఇండియన్ 2 సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ విషయంలో మరికొంత సమయం పట్టే అవకాశం ఉందట. అందుకే దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాను 2024 మార్చిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇండియన్ 2 మాత్రం 2024 దీపావళికి లేదా ఆ తర్వాత 2025 సంక్రాంతికి రిలీజ్ చేయవచ్చని సమాచారం.