జూనియర్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గాలి కిరీటిరెడ్డి.. వైరల్ అవుతున్న టైటిల్ పోస్టర్!

కన్నడ నాట రాజకీయాలలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించి ప్రముఖ రాజకీయ నాయకుడిగా వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు గాలి జనార్దన్ రెడ్డి. ఇలా రాజకీయ నాయకుడిగా ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన కుమారుడు కిరీటీ రెడ్డి తండ్రి బాటలో రాజకీయాలలోకి వెళ్లకుండా సినిమాలపై మక్కువతో సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోని కిరీటి రెడ్డిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ తన తండ్రిగారి జనార్దన్ రెడ్డి ఓ సినిమాని నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే.

రాధాకృష్ణన్ రెడ్డి దర్శకత్వంలో కిరీట్ రెడ్డి శ్రీ లీల జెనీలియా వంటి వారు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభం చేసుకుంది.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా చిత్ర బృందం ఓ అప్డేట్ విడుదల చేశారు.గురువారం కిరీటి రెడ్డి పుట్టినరోజు కావడంతో మేకర్స్ తన డెబ్యూ సినిమాకి సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే తాను నటిస్తున్న సినిమాకి టైటిల్ ఫిక్స్ చేసి టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.

కిరీట్ రెడ్డి నటిస్తున్న సినిమాకు జూనియర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఈ క్రమంలోనే గురువారం టైటిల్ పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మంచి స్పందన లభించుకుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మరి డెబ్యూ సినిమాతోనే కిరీట్ రెడ్డి ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచి చూడాలి.ఈ సినిమా ద్వారా హిట్ కొట్టి ఇండస్ట్రీలో హీరోగా నిలబడతారా లేకపోతే తండ్రి బాటలోనే రాజకీయాలలోకి వెళ్తారా అనే విషయంపై అభిమానులు కూడా ఆత్రుత కనబరుస్తున్నారు.