Pan India Stars : మనం ఏ పని చేసినా అందులో టాప్ పొజిషన్ కు వెళ్లాలనే కోరిక అందరికీ ఉంటుంది. అలా చేరుకోవాలి అంటే దానికి సరైన మార్గం, కృషి పట్టుదల తోడవ్వాలి. ఇక సినిమా పరిశ్రమ విషయానికొస్తే దీంట్లో ఎదుగుదల అనేది ఎవరూ ఊహించలేరు. సినిమా ఇండస్ట్రీ లో అయితే అడుగు పెట్టిన తర్వాత దానికి తగ్గట్టు సరైన మార్గం లేకపోతే లక్ష్యాన్ని చేరుకోలేరు. ఇలాంటి చిత్ర పరిశ్రమలో బుల్లి తెరకు పరిచయమైన ఈ ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ స్టార్స్ గా ఎదిగారు.
వారిలో ఒకరు రాజమౌళి. రాజమౌళి కెరియర్ బుల్లితెర తో ప్రారంభమైంది. బుల్లితెర మీద కొన్ని సీరియల్స్ కు దర్శకత్వం వహించే వారు రాజమౌళి. బుల్లితెర మీద ఈయన చేసిన సీరియల్స్ సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యాయి. అయితే సినిమాలు తీయాలనే ఈయన కోరికతో వెండితెర మీద సినిమాలు తీయడం ప్రారంభించారు. ఇలా సినిమాలు చేస్తూ చేస్తూ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ స్టార్ గా ఎదిగారు. అసలు మన ఫిలిం ఇండస్ట్రీ కి పాన్ ఇండియా అనే పదం బాహుబలి సినిమా తో రాజమౌళి నే మొదటి పరిచయం చేశారు.ఇపుడు ప్రస్తుతం ఈయనతో సినిమా అంటే వదులుకోవడానికి ఏ హీరో కూడా ఇష్టపడదు.
అయితే బుల్లితెర తో ప్రస్థానం మొదలు పెట్టి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన మరొక వ్యక్తి కన్నడ సూపర్ స్టార్ యష్. ఎస్ కూడా బుల్లితెర మీద సీరియల్స్ లో నటించారు. సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. హీరో అవ్వాలని తపనతో వెండితెర మీద తన ప్రసంగాన్ని మొదలు పెట్టాడు. అయితే కేజిఎఫ్ సినిమా తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. ఇక తాజాగా వచ్చిన కేజిఎఫ్ 2 సినిమా యష్ కు ప్రపంచవ్యాప్తంగా ఫాన్స్ ను తెచ్చిపెట్టింది. ఇలా బుల్లితెర పరిచయమైన ఇద్దరు స్టార్స్ తమ లక్ష్యాలతో పాన్ ఇండియా సూపర్ స్టార్స్ గా వెలుగుతున్నారు.