సీన్ ఏదైన సరే, పాత్రలో ఒదిగిపోయి పండించే నట శిరోమణి సమంత. అనితర సాధ్యమైన నటనాపటిమతో అలరారిన నటశిరోమణి ఆమె. కరుణరసం ఉట్టిపడే పాత్రల్లో , వీరరసం ఉప్పొంగే పాత్రల్లో జీవించడం ఆమెకు ఆమెనే సాటి. ఇన్నాళ్ళు నటిగా ప్రేక్షకులని అలరించిన సమంత ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ గాను అదరగొడుతుంది. దసరా స్పెషల్ ఎపిసోడ్‌కు వ్యాఖ్యాతగా బిగ్ బాస్ స్టేజ్‌పై అడుగుపెట్టిన సమంత ముందుగా తన మామ నాగార్జునతో మాట్లాడి ఆ తర్వాత మామ టీవీ అంటూ ఇంట్లోకి వెళ్లింది. ముందుగా ఆడపిల్లల గురించి చెప్పిన సమంత .. అరియానా ఫైటర్, జాలి గుండె అని చెప్పింది. తనని చూస్తే నాలానే అనిపిస్తుందని పేర్కొంది.
అబ్బాయిలు ఫీలైనా సరే వాళ్ల గురించి చెప్పనని అన్న సమంత ఆ తర్వాత వాళ్ల గురించి పాజిటివ్, నెగెటివ్ విషయాలు చెప్పాలంటూ పేర్కొంది. ఇక వారు వారి పాజిటివ్, నెగెటివ్‌లు ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్‌లో స్వయంవరం నడిచింది. ఇందులో మూడు రౌండ్స్ ఉంటాయని చెప్పిన సమంత ముందుగా అబ్బాయిలు హౌజ్‌లో ఉన్న అమ్మాయిలని ఇంప్రెస్ చేయాలని చెప్పారు. సోహైల్ తన కండలు ప్రదర్శించగా, అభిజిత్ ఇట్స్ యువర్ లవ్ సాంగ్ పాడాడు, మెహబూబ్, అవినాష్ లు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. అయితే మంచి మాటలతో పాటు చక్కని పాట పాడిన అవినాష్‌కు నలుగురు అమ్మాయిలు ఫిదా కావడంతో అతనిని విజేతగాప్రకటించారు.
దీంతో అఖిల్‌కు స్పెషల్ గిఫ్ట్ అంటూ ఫ్యామిలీ వీడియో చూపించారు. ఇందులో అఖిల్ ఫ్యామిలీ మాట్లాడుతూ.. నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నువ్వు గుర్తొస్తే నీ రూంకి వెళ్లి ఆలోచిస్తున్నాం. మంచిగా ఆడు, అదే మాకు సంతోషం అంటూ అఖిల్ అమ్మ మాట్లాడారు. ఫ్యామిలీని చూడగానే అఖిల్ చాలా కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇంటి సభ్యులు అతనిని ఓదార్చగా తర్వాతి ఛాన్స్ ఎవరికి ఇస్తావు అంటే మోనాల్ పేరు చెప్పాడు. ఆమె కూడా తన ఫ్యామిలీని చూసి తెగ ఏడ్చేసింది. అనంతరం ఇంటి సభ్యుల అందరికి వాళ్ళ ఫ్యామిలీ వీడియోలు చూపించారు. ఇక ఎలిమినేషన్‌లో ఉన్న అరియానా, అభిజిత్, మోనాల్‌లు ఇప్పటి వరకు సేవ్ కాగా, దివి ఎలిమినేట్ కానున్నట్టు తెలుస్తుంది.