అబ్బే అలాంటిదేమీ లేదు , పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ !

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో 28 వ సినిమాగా రాబోతోంది. 26 గా వకీల్ సాబ్.. 27 గా క్రిష్ సినిమా తెరకెక్కుతుండగా ఆ తర్వాత పవన్ – హరీష్ శంకర్ ల సినిమా రూపొందబోతోంది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ వచ్చి ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది. మళ్ళీ ఆ తర్వాత ఇదే కాంబినేషన్ లో మరో సెన్షేషనల్ హిట్ వస్తుందని అభిమానులు ఆశించారు. కాని పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాలలోకి వెళ్ళడం తో ఈ కాంబినేషన్ సెట్ అవలేదు.

PSPK 28: Pawan Kalyan's 28th film concept poster out on his birthday |  Telugu Movie News - Times of India

ఎట్టకేలకి వకీల్ సాబ్ తో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరసగా ప్రాజెక్ట్స్ ని ప్రకటించాడు. అయితే పవన్ కళ్యాణ్ 28 గురించి గత కొన్ని రోజులుగా రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ముఖ్యంగా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజైనప్పటి నుంచి ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ని పోలీస్ ఆఫీసర్ గానే హరీష్ శంకర్ చూపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గానే నటించబోతున్నాడు.

అందుకే మళ్ళీ అలాంటి క్యారెక్టర్ లోనే పవన్ కళ్యాణ్ ని చూపిస్తే జనాలకి బోర్ కొడుతుందన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం హరీష్ శంకర్ పవన్ ని పోలీస్ ఆఫీసర్ గా చూపించడం లేదని ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇక త్వరలో క్రిష్ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుండగా చిన్న గ్యాప్ లోనే అయ్యప్పనుం కూడా మొదలవబోతోంది. సమ్మర్ నుంచి పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతోందని సమాచారం.