Akhil: అఖిల్ అక్కినేని నాగార్జున కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన మాత్రం ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. ఇప్పటివరకు ఓ ఐదారు సినిమాలలో నటించిన అఖిల్ ఈ సినిమాల ద్వారా అనుకున్న స్థాయిలో ఏమాత్రం గుర్తింపు పొందలేకపోయారు అయితే ఈసారి రాబోయే సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక ఈయన సినిమాలకు సంబంధించిన విషయాలు పక్కన పెట్టే వ్యక్తిగత విషయానికి వస్తే త్వరలోనే అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పటికే అఖిల్ శ్రేయ భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నారు కానీ కొన్ని కారణాలవల్ల ఆ నిశ్చితార్థం బ్రేకప్ కావడంతో తిరిగి ఈయన జైనాబ్ అనే అమ్మాయితో ప్రేమలో పడటం గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఇటీవల పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకోవడం జరిగింది.
ఇక వీరి నిశ్చితార్థానికి సంబంధించి అధికారిక ప్రకటన నాగార్జున వెల్లడించారు ఇక త్వరలోనే వీరీ వివాహం కూడా జరగబోతుంది వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి జరగబోతుందని తెలుస్తుంది. అయితే అక్కినేని కుటుంబంలో ఇప్పటివరకు ఎంతోమందికి రెండు పెళ్లిళ్లు జరిగాయి ఇటీవల నాగచైతన్య కూడా శోభితను రెండో పెళ్లి చేసుకున్నారు అయితే వీరి పెళ్లిళ్లు అన్నీ కూడా హిందూ సాంప్రదాయ ఆచారంలోనే జరిగాయి కానీ మొదటిసారి అక్కినేని కుటుంబంలో అఖిల్ ముస్లిం సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది.
ఇలా అక్కినేని నాగేశ్వరరావు నుంచి మొదలుకొని అక్కినేని కుటుంబంలో ఎంతోమంది పెళ్లిళ్లు చేసుకున్నారు అయితే వారందరూ కూడా హిందూ సాంప్రదాయ ఆచారాలు ప్రకారమే పెళ్లి చేసుకోగా అఖిల్ మాత్రమే ముస్లిం ఆచార వ్యవహారాల ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. అయితే జైనాబ్ ముస్లిం మతానికి చెందిన అమ్మాయిని అందుకే వారి ఆచారాల ప్రకారం ఈయన పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సంచలనగా మారింది.
