Nani : అంటే సుందరానికి ట్రైలర్ తో ఆకట్టుకున్న కేరళ కుట్టి…సినిమాపై అంచనాలు పెంచేసిన ఆ చిన్నది!

 

Nani: నాచురల్ స్టార్ నాని ఇటీవల విడుదల అయిన శ్యామ్ సింగరాయి సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి నటించింది. శ్యామ్ సింగరాయి సినిమా తర్వాత నాని నటిస్తున్న చిత్రం అంటే సుందరానికి. అంటే సుందరానికి సినిమాకి యువ దర్శకుడు అయినా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తొలిసారి నజ్రీయా తెలుగు సినిమా లో నటించనున్నారు.

తాజాగా చిత్రంలో నజ్రియా పాత్రకు సంబంధించిన పోస్టర్ మరియు టీజర్ని విడుదల చేశారు. అంటే సుందరానికి సినిమా లో నజ్రియా, లీల థామస్ పాత్రను పోషించనున్నారు. చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ మరియు టీజర్ కి గాను అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో నజ్రియా ఒక ఫోటోగ్రాఫర్ లో కనిపించనున్నారు.

YouTube video player

ఈ సినిమాలో నదియా,హర్షవర్ధన్,రాహుల్,రమ్యకృష్ణ మరియు సుహాస్ వంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని రూపొందించనున్నారు. శ్యామ్ సింగ్ రాయి విజయం తర్వాత వస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. కామెడీ మార్కు ఉన్న సినిమాలో నాని చక్కగా నటిస్తారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.