“భగవంత్ కేసరి”తో బాలయ్య మొదటిసారి రికార్డు బిజినెస్?

ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న సీనియర్ స్టార్ హీరోస్ లో అయితే కొందరి మార్కెట్ డౌన్ అవుతూ ఉంటే మరికొందరు మార్కెట్ మాత్రం మెల్లగా పెంచుకుంటూ వెళ్తున్నారు. కాగా ఈ లిస్ట్ లో అయితే నందమూరి వారి నటసింహ టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు.

మరి బాలయ్య నటించిన ఒకో సినిమా తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతూ వస్తుండగా ఇప్పుడు ఈ చిత్రాలతో అయితే ఇప్పుడు బాలయ్య తన కెరీర్ లో రికార్డు బిజినెస్ మార్క్ ని చేరుకున్నట్టుగా తెలుస్తుంది. కాగా ఇప్పుడు బాలయ్య చేస్తున్న భారీ ఏక్షన్ డ్రామా చిత్రం “భగవంత్ కేసరి”.

ఈ చిత్రం తో బాలయ్య రికార్డు మార్క్ బిజినెస్ ని చేస్తున్నట్టుగా ఇపుడు సినీ వర్గాలు నుంచి రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ తో బాలయ్య కెరీర్ లో మొట్ట మొదటిసారి 100 కోట్ల బిజినెస్ ని వరల్డ్ వైడ్ థియేట్రికల్ గా చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. ఇది మొదటిసారి బాలయ్య ఈ మార్క్ కి చేరుకోగా మరి ఇందులో ఎంతమేర నిజముందో చూడాలి.

అయితే ఇపుడు బాలయ్య చిత్రాలు హిట్ అయితే ఈజీగా 85 నుంచి 90 కోట్ల మధ్యలో షేర్ వస్తుంది. కరెక్ట్ కంటెంట్ పడితే బాలయ్య ఖచ్చితంగా దుమ్ము లేపేస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. మరి భగవంత్ కేసరి విషయంలో ఏమవుతుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తుండగా కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యువ హీరోయిన్ శ్రీలీల ముఖ్య పాత్రలో నటిస్తుంది.