నిఖిల్ “స్పై” టీజర్ కి ఇండియాలో ఫస్ట్ ఎవర్ ప్లాన్.!

పాన్ ఇండియా సినిమా దగ్గర సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోస్ లో తన మొదటి అటెంప్ట్ లోనే భారీ హిట్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. అయితే నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హిట్ అందుకోగా ఇక నెక్స్ట్ కూడా మళ్ళీ పాన్ ఇండియా వైడ్ బాగా రీచ్ అయ్యే పాయింట్ తో వస్తున్న సినిమానే “స్పై”.

దర్శకుడు గారి బి హెచ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సుభాష్ చంద్రబోస్ మిస్టరీ పై తెరకెక్కింది. దీనితో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా ఈ భారీ సినిమా టీజర్ కి ఇప్పుడు మాసివ్ అండ్ ఇండియన్ సినిమా దగ్గరే ఫస్ట్ ఎవర్ యూనిక్ ప్లాన్ ని చేసారు.

ఈ టీజర్ ని అయితే ఢిల్లీ లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రతిమ దగ్గర ఈ మే 16న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి ఇలా ప్లాన్ చేయడం నిజంగా మొదటి సారి కాగా వీరికి పర్మిషన్ కూడా దొరకడం ఆసక్తికర అంశం అని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో అయితే గ్లామరస్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా ఈ టీజర్ లాంచ్ పై కూడా అదిరే వీడియో ని రిలీజ్ చేసారు. ఇక ఈ చిత్రం అయితే ఈ చిత్రం అయితే ఈ జూన్ 29న తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ మరియు కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.