ఇండస్ట్రీ టాక్ : ఫైనల్ గా వెనక్కి తగ్గేది విజయ్ సినిమానే??

టాలీవుడ్ సినిమా దగ్గర పండుగ వస్తుంది అంటే ఆ హడావుడే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. కాగా ఇప్పుడు రానున్న 2024 సంక్రాంతి పండుగకి అయితే అంతా ఓ రేంజ్ లో ఎదురు చూస్తుండగా ఆల్రెడీ ఈ రేస్ లో అనేక చిత్రాలు వరుసగా రెడీ అయిపోయాయి. అయితే మరి ఈ పోటీలో కొందరు పర్శనల్ గా కూడా తీసుకొని తమ సినిమాలు దింపుతున్నారు.

మరి అలా వచ్చిన చిత్రాల్లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరియు దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో చేస్తున్న “ఫ్యామిలీ స్టార్” అనే సినిమా కూడా ఒకటి. మరి ఈ చిత్రంని మాస్ మహారాజ రవితేజ “ఈగిల్” తో పోటాపోటీగా నిర్మాతలు అనౌన్స్ చేసుకున్నారు.

అయితే గత కొంత కాలం నుంచి కూడా ఎవరూ వెనక్కి తగ్గేదిలేదు అని తెగేసి చెప్పేవారు కానీ ఈ బిగ్ రేస్ లో మాత్రం ఫైనల్ గా వెనక్కి తగ్గుతుంది విజయ్ సినిమానే అని సినీ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఫామిలీ స్టార్ట్ సినిమా అయితే సంక్రాంతి బరిలో ఉండకపోవచ్చని వేరే డేట్ కోసం వారు ఇప్పుడు సినిమా మార్చుకుంటున్నారని రూమర్స్ మొదలయ్యాయి.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందొ మరో అప్డేట్ వస్తే తెలుస్తుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ఆమె ఈ సినిమాతో తెలుగులో మూడో సినిమా చేస్తుంది. అలాగే ఈ సినిమాని ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.