ఫైనల్ గా మెగా ఫ్యాన్స్ కావాల్సింది చేస్తున్న మెగాస్టార్…!

xv9gh1b8uxw6lrxbf-1578316886-1583123364-jpeg-pagespeed-ic--qk8eqiv14-1585219563

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన పలు భారీ డిజాస్టర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ కూడా ఒకటి. ఈ ఏడాదిలో ఎంత పెద్ద హిట్ ఇచ్చిన మెగాస్టార్ అంతే భారీ డిజాస్టర్ ని డెలివర్ చేశారు. దీనితో మెగా ఫ్యాన్స్ అసహనం అంతా ఇంతా కాదు.

అందరు సీనియర్ స్టార్ హీరోలు తమ ఏజ్ సినిమాలు చేస్తుంటే మన తెలుగు హీరోలు మెగాస్టార్ లు ఇంకా హీరోయిన్ లు డ్యూయెట్ లు దగ్గరే ఉండిపోయారు అని అంటున్నారు. ఇక వీటితో పాటుగా ఫ్యామిలీ మ్యాన్ లాంటి సబ్జెక్టు ని మెగాస్టార్ వదిలేసుకున్నారని వచ్చిన వార్తలతో మరింత కుంగిపోయారు.

దీనితో మెగాస్టార్ తన లెవెల్ ఇప్పుడు ఉన్న ఏజ్ సినిమా ఎప్పుడు అనేదానికి ఇపుడు సమాధానం దొరికేసింది. ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్న సీనియర్స్ స్టార్స్ కమల్ హాసన్ రజినీకాంత్ లాంటి వారు జైలర్, విక్రమ్ లతో సెన్సేషనల్ హిట్స్ కొట్టగా ఇప్పుడు వారిలానే నేను మెగాస్టార్ కి సరైన సినిమా ఇస్తానని బింబిసార దర్శకుడు మల్లిడి వసిష్ఠ చెప్తున్నాడు.

ఆయన ఏజ్ కి తగ్గ సరైన సినిమా ఇది అని అలాగే మళ్ళీ ఒకప్పుడు పిల్లలకి జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఫాంటసీ సినిమా ఎలాంటి ట్రీట్ ఇచ్చిందో ఇపుడు తాను తన సినిమాతో అయితే అందిస్తున్నానని కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాడు. దీనితో మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ట్రెండ్ లోకి అయితే మెగాస్టార్ ఫైనల్ గా వచ్చేసారు అని చెప్పాలి.