వైరల్ – మొత్తానికి మరో ఇంటివాడైన మంచు మనోజ్..!

1977484036_manchu-manoj-mounika-wedding-1_1280_720

టాలీవుడ్ లో ఉన్న పలు స్టార్ ఫ్యామిలీస్ లో మంచు వారి కుటుంబానిది ప్రత్యేక స్థానం అని చెప్పాలి. మోహన్ బాబు నుంచి మంచు విష్ణు అలాగే మంచు లక్ష్మి లు కూడా అంతా ఒకొకరికి ఒకో లోకం. అయితే వీరందరిలో కూడా కాస్త మంచు మనోజ్ బాగా రియాలిటీ ని నమ్ముతాడు అందులోనే ఉంటాడు.

అందుకే మిగతా వారి కన్నా మంచు మనోజ్ ని ఇష్టపడే వారే ఎక్కువ ఉంటారు. అలాగే మరోపక్క అయితే మంచు మనోజ్ తన కెరీర్ పరంగా చాలా కాలం గ్యాప్ తీసుకున్నాడు. ఓ పక్క ప్రొఫిషనల్ గా మరో పక్క పర్సనల్ గా కూడా బాగా డిస్టబ్ అయ్యిన మనోజ్ తన మొదటి వైవాహిక బంధానికి స్వస్తి చెప్పి రెండో పెళ్ళికి సిద్ధం అయ్యాడు.

ఇంట్లో పెద్దల అంగీకారంతో అయితే ప్రముఖ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన భూమా మౌనిక రెడ్డి ని అయితే నిన్న వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ఆరంభించాడు. మరి నిన్న హైదరాబాద్ లోనే చాలా లిమిటెడ్ గా ఈ వేడుకలు జరిగాయి. అతిధులు తక్కువమందినే పిలుచుకున్నా గ్రాండ్ గా ఈ పెళ్లి జరిగినట్టుగా తెలుస్తుంది.

కాగా ఈ పెళ్ళికి అయితే వై ఎస్ జగన్ తల్లి విజయమ్మ, భూమా అఖిల ప్రియ తదితరులు హాజరయ్యారు. కాగా మనోజ్ మరియు మౌనిక లు అయితే గత రెండేళ్ల నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారట ఫైనల్ గా ఇప్పుడు ఒకటయ్యారు. దీనితో వీరి పెళ్ళిలో ఎమోషనల్ విజువల్స్ తాలూకా ఫోటోలు వైరల్ గా మారాయి.