ఇన్సైడ్ టాక్ : ఫైనల్ గా “వీరమల్లు” షూట్ ఎప్పుడు నుంచంటే.!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసిన సినిమా “హరిహర వీరమల్లు”. పవర్ స్టార్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇది కాగా దర్శకుడు క్రిష్ అయితే దీనిని తెరకెక్కిస్తుండగా పవన్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

మరి ఈ చిత్రం ఇప్పటికి కేవలం 70 శాతం మేర మాత్రమే కంప్లీట్ కాగా ఈ షూట్ అనంతరం ఇక సినిమా మళ్ళీ షూట్ లోకి వెళ్ళింది లేదు. కాగా ఈ చిత్రం షూట్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఇంకా ఎవరికీ తెలియరాలేదు. పైగా పవన్ కూడా ఇతర సినిమాలనే ముందు స్టార్ట్ చేస్తుండడంతో హరిహర వీరమల్లు పక్కకి పోయినట్టే అని అంతా అనుకున్నారు.

అయితే ఇప్పుడు ఈ భారీ సినిమా షూట్ పై అయితే పవన్ కి సంబంధించిన కొన్ని ట్రస్టడ్ సోర్సెస్ నుంచి ఇన్ఫో తెలుస్తుంది. కాగా ఈ సినిమా అయితే ఫైనల్ గా ఈ ఆగష్టు నుంచి స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. నిన్ననే పవన్ తో తన నిర్మాతలై అంతా కలవగా వారితో మాట్లాడి ఒకో సినిమాకి ప్లానింగ్ అయితే ఇవ్వగా అందులో వీరమల్లు షూట్ ని ఆగష్టు ల సెట్ చేసుకునేలా ప్లాన్ చేశారట.

దీనితో అయితే ఫైనల్ గా ఈ భారీ సినిమా ఆగష్టు నుంచి స్టార్ట్ కానుంది అని చెప్పాలి. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాలో మరింతమంది బాలీవుడ్ నటులు నటిస్తున్నారు. ఇక రిలీజ్ అయితే అది ఆ పైవాడికే తెలియాలి.