‘శ్యామ్ సింగరాయ్’ లో సినిమా ఇండస్ట్రీ సమస్య నే చూపించబోతున్న నాని ..!

న్యాచురల్ స్టార్ నాని త్వరలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నటించబోతున్నాడు. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యయన్ ఈ సినిమాని తెరకెక్కించబోన్నాడు. నాని డ్యూయల్ రోల్స్ లో నటించబోతున్నాడని సమాచారం. కాగా ఒక పాత్రలో దర్శకుడిగా.. వేరొక పాత్రలో హీరోగా నటిస్తున్నాడని అంటున్నారు. సాయి పల్లవి, ఉప్పెన ఫేం కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుందని సమాచారం.

Shyam Singha Roy: Nani, Sai Pallavi, Krithi Shetty To Play Lead Roles! Film  To Go On Floors In December

కాగా ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో గత కొన్నేళ్ళుగా సినిమా ఇండస్ట్రీ లో ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి చూపించబోతున్నట్టు సమాచారం. ఇండస్ట్రీలో సంవత్సరాలుగా మన సినిమాలపై కాపీ మరక పడుతోంది. రాజమౌళి లాంటి అగ్ర దర్శకులు తీసిన సినిమా నుంచి యంగ్ డైరెక్టర్స్ తీసిన సినిమాల వరకు చాలా సినిమాల మీద కాపీ అన్న మాట ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాలో సీన్ పలానా సినిమా నుచి కాపీ కొట్టారని.. పలానా భాషలో తీసిన సినిమా చూసి ఈ సినిమా తీశారని ఇలా కొత్తగా రిలీజైన సినిమాకి కాపీ మరక అంటించేస్తున్నారు.

కాగా ఇప్పుడు ఇదే అంశాన్ని ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారట. కాపీ అన్న అంశం మీద సెటైర్లు వేస్తూ సినిమా ని ఎంటర్‌టైనింగ్
గా తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. సినిమాలో నాని డైరెక్ట్ చేసిన సినిమాపై కాపీ మరక పడటాన్ని కధానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడనే అంశాన్ని సినిమాలో చూపించనున్నారని తెలుస్తుంది. తను తీసిన సినిమా మరే సినిమా నుంచి కాపీ కొట్టలేదని ఇది ఒరిజినల్ కథ అన్న అంశాన్ని ఎంటర్‌టైనింగ్ గా చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇదే గనక నిజమైతే నాని మరోసారి ప్రయోగం చేస్తున్నట్టే అని చెప్పాలి. గ్యాంగ్ లీడర్, వి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. మరి ఇప్పుడు నటించబోతున్న ‘శ్యామ్ సింగరాయ్’ ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాతో మరో రెండు సినిమాలని కమిటయ్యాడు నాని. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టక్ జగదీష్ శరవేగంగా షూటింగ్ జరుగుతోందట.