అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే, వీరి వివాహం వేళ సమంత పోస్ట్ ఆసక్తికరంగా మారింది. సామ్ సోషల్ మీడియా వేదికగా స్ఫూర్తినింపే వీడియోలు, కొటేషన్‌లూ పంచుకుంటున్న విషయం తెలిసిందే.
తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇన్‌స్టా స్టోరీస్‌లో తాజాగా షేర్ చేసింది. ఈ వీడియోలో ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య కుస్తీ పోటీ జరుగుతోంది. మొదట్లో ఆ అబ్బాయి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆటలోకి దిగుతాడు. చివరికి అమ్మాయి చేతిలో ఓడిపోతాడు. ఈ వీడియో షేర్ చేసిన సామ్.. ‘ఈ అమ్మాయిలా పోరాడండి’ అంటూ క్యాప్షన్ పెట్టారు.
ప్రస్తుతం పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా, సామ్ గత కొంతకాలంగా గడ్డుపరిస్థితుల్ని ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. నాగ చైతన్యతో విడాకుల అనంతరం కొద్దిరోజులకే మయోసైటిస్ బారిన పడింది. దాన్నుంచి కోలుకునేందుకు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే.. మళ్లీ తిరిగి తన వర్క్‌లైఫ్‌లో బిజీగా మారుతుండగా ఇంతలో తన తండ్రి జోసెఫ్ ప్రభు హఠాత్తుగా మరణించారు. మరోవైపు మాజీ భర్త మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర మనోవేదనలో ఉన్న సామ్‌కు నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు.