కనగరాజ్‌ నిర్మాణంలో ఫైట్‌ క్లబ్‌!

కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ఐ ‘జి స్క్వాడ్‌’ అనే పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రోడక్షన్‌ హౌస్‌ నుంచి వచ్చే మొదటి సినిమాను కూడా లోకేష్‌ రీసెంట్‌గా ప్రకటించేశాడు. ఫైట్‌ క్లబ్‌ అంటూ ఈ సినిమా రానుండగా.. ఊరియాడి ఫేం విజయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుండగా.. తాజాగా ఈ మూవీ నుంచి చిత్రబృందం మరో సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ మూవీకి సంబంధించి టీజర్‌ను విడుదల చేశారు. అబ్బాస్‌ ఏ రహ్మత్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రానికి గోవింద్‌ వసంత సంగీతం అందిస్తున్నారు. 2023 డిసెంబర్‌లో థియేటర్లలో సందడి చేయనుందని మేకర్స్‌ ప్రకటించారు. అయితే ప్రస్తుతం లోకేశ్‌ బ్యానర్‌లో వస్తున్న ఈ మూవీ ఈ కథతోనే వస్తుందా లేదా వేరే స్టోరీనా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.