సమంత మీరు మాత్రం అంత పనిచేయకండి చచ్చిపోతామంతే ..!

ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ అందరు ప్రయోగాలకి సిద్దమవుతున్నారు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే నెగిటివ్ రోల్స్, బయోపిక్స్, డిజార్డర్ ఉన్న క్యారెక్టర్స్ ఒప్పుకొంటున్నారు. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకైతే కొదవే లేదు. కథ లో సూటవుతామనుకుంటే వెంటనే ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. అయితే కొన్ని సార్లు ఆ ప్రయోగాలు దెబ్బ కొడుతున్నాయి. ఉన్న స్టార్ డం మొత్తాన్ని దిగజార్చుతున్నాయి.

I had no difficulty playing both a teenager and a married man in Majili:  Naga Chaitanya- Cinema express

పెళ్ళి కి ముందు కమర్షియల్ సినిమాలు గ్లామర్ రోల్స్ చేసింది సమంత. అయితే పెళ్ళి తర్వాత మాత్రం మజిలీ.. ఓ బేబి..లాంటి కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలే అంగీకరిస్తుంది. ఈ క్రమంలో నటించిన ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే ఆ తర్వాత హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకొని జాను సినిమా లో నటించింది సమంత. కాని ఈ సినిమా డిజాస్టర్ అయి సమంత ని డిసప్పాయింట్ చేసింది. కాగా మరోసారి భర్త నాగ చైతన్య తో కలిసి నటించేందుకు మజిలీ వంటి కథలు కోసం ఎదురు చూస్తుందట.

Oh Baby': Samantha Akkineni looks chic and cool as Swathi in the official  poster

ఈ నేపథ్యంలో ఓ బేబి సినిమాతో సమంత కి మంచి హిట్ ఇచ్చిన లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తో మాత్రం మరోసారి సమంత సినిమా చేయబోతుందని ఆ సినిమాలో చైతూ కూడా నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఇద్దరు కలిసి నటించే కథ గనక వస్తే వదలకూడదని భావిస్తుందట సమంత. ఇక ఇప్పటికే తమిళంలో నయనతార కాబోయో భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లో నయనతార తో కలిసి సమంత నటించబోతుందని కోలీవుడ్ మీడియా సమాచారం. కాగా సమంత డెబ్యూ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 లో నటించిన సంగతి తెలిసిందే.

ఇటీవల ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తయిందని మేకర్స్ వెల్లడించారు. ఇక తాజాగా అశ్విన్ శరవనన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమాలో సమంత మూగ అమ్మాయిగా నటించనుందని అంటున్నారు. అయితే ఇటీవలే అనుష్క నటించిన నిశ్శబ్ధం ఈ తరహా కథే. కాని ఈ సినిమా ప్రేక్షకులని డిసప్పాయింట్ చేసింది. అందుకే ఇప్పుడు సమంత ఇలాంటి క్యారెక్టర్ చేస్తానంటే ఫ్యాన్స్ చూడలేమని అంటున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో చూడాలి.