ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు అనే డైలాగ్ ఇప్పుడు వినడానికి కాస్త ఇబ్బందిగా ఉందని సోషల్ మీడియాలో అనేక రకాల మీమ్స్ వస్తున్నాయి. రజినీకాంత్ నిజంగా ఆరోగ్య కారణాల వల్లనే రాజకీయాల నుంచి తప్పుకున్నారా లేక మరేదైనా కారణం ఉండవచ్చా అనే సందేహాలు అనేక రకాలుగా పూట్టుకొస్తున్నాయి. బహుశా ఆయన రాజకీయాల్లోకి వచ్చినా ఈ రేంజ్ లో వార్తలు వచ్చి ఉండేవి కాదేమో.
హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకోగానే రాత్రికి రాత్రే నిర్ణయంలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఎన్ని రకాల రూమర్స్ వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తలైవా కూడా తన ఎంట్రీ ఉండనున్నట్లు చాలాసార్లు ఇన్ డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తూ వచ్చారు. ఇక మంగళవారం రాజకీయ ప్రకటన ఉండదని చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులు గుండెలు పట్టుకున్నారు. ట్వీట్ వేసిన సాయంత్రానికే చెన్నైలోని సుపర్ స్టార్ ఇంటిముందు ఒక్కసారిగా అభిమానులు నిరసనకు దిగారు.
వెంటనే రజనీకాంత్ తన మాటను వెనక్కి తీసుకొని రాజకీయాల్లోకి రావాలని అంటున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రజనీకాంత్ నిర్ణయంపై జనాలు అసంతృప్తి చేస్తున్నట్లు ఈజీగా అర్ధమవుతోంది. పాలిటిక్స్ లోకి రాకుండానే రాజకీయాల నుంచి తప్పుకున్న ఏకైక వ్యక్తి ఆయనే.. అది రజినీకి మాత్రమే సాధ్యమైంది అంటూ మరోవైపు మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మరి రానున్న రోజుల్లో ఆయన నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందో చూడాలి.