Super star Krishna : కృష్ణ గారి ఆరోగ్యంపై అనుమానాలు…. ఆందోళనలో అభిమానులు….!

Super star Krishna : తెలుగు సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత కమర్షియల్ హీరో ఎవరంటే కృష్ణ గారే. అప్పట్లో ఆయనకు ఉండే అభిమాన సంఘాలు మరే హీరోకు లేవు అంటే అతిశయోక్తి కాదేమో. ఇక ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. కౌ బాయ్ సినిమాలు, గూఢచారి సినిమాలతో తెలుగు తెర పై కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు.ఇక ఆయన కొడుకు మహేష్ బాబు కూడా కౌ బాయ్ మళ్ళీ అలరించడం విశేషం. ఇక సూపర్ స్టార్ కృష్ణ వృద్ధాప్యం కారణంగా, కరోనా కారణంగా ఆయన ఈ మధ్య బయటకు రావడంలేదు.

ఇక ఇటీవల వారి కుటుంబానికి సంబంధించిన కార్యక్రమంకు హాజరయ్యారు కృష్ణ. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఆయన పెద్ద కూతురు మంజుల తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో చాలా రోజుల తరువాత కృష్ణ ను ఆయన అభిమానులు చూసారు. అయితే ఆయన ముఖం లో ఏదో తేడా ఉండటంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేసారు.ఇక వీరి అనుమానలకు క్లారిటీ ఇచ్చారు కుటుంబ సభ్యులు.ఫ్యామిలీ ఫంక్షన్ లో ఆయన ఇన్విజిబుల్ ఫేస్ మాస్క్ ధరించారని.. అది ముఖంలో కలిసిపోవడం వల్ల అలా కనిపించిందని తెలిపారు. అలాగే కృష్ణగారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఊపిరి తీసుకున్నారు.