రవితేజ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజాగా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తర్వాత మళ్ళీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్వశక్తితో హీరోగా ఎదిగిన వ్యక్తి అంటే రవితేజనే. ఈ విషయం పలు సందర్భాలలో సినీ ప్రముఖు అందరి ముందు చెప్పిన సంగతి కూడా తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే సపోర్ట్ కావాలి. ఫ్యామిలీ జనరేషన్ ఉండాలి అన్న విషయంలో అది తప్పు .. టాలెంట్ ఉంటే ఇక్కడ ఎవరైనా సక్సస్ అవ్వొచ్చు అని రవితేజ నిరూపించాడు.
రవితేజ కెరీర్ ప్రారంభంలో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే చాలా మందికి ఒక చులకన భావం ఉంటుంది. అంతేకాదు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ స్టార్ హీరో అవడం అన్నది చాలా అంటే చాలా అరుదుగా జరిగే విషయం. కాని రవితేజ లో ఉన్న పట్టుదల కృషి ఈ రోజూ ఇంతటివాడిని చేశాయి. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా దర్శకుడిగా.. హీరోగా ఎదగడానికి కెరీర్ ప్రారంభం లో చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. పస్తులుండాల్సి వస్తుంది.
ఆ సమయంలో 100 రూపాయలు కళ్ళ చూసిన ఆ ఆనందం మాటల్లో చెప్పలేరు. కోట్లూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ రోజు కంటే మొదటి సారి 100 రూపాయలు సంపాదించిన రోజే జీవితాంతం గుర్తుంటుంది. రవితేజ కి అలాంటి మర్చిపోలేని సంఘటన ఉందని తాజాగా వెల్లడించాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో అక్కినేని నాగార్జున నిర్మాతగా వచ్చిన నిన్నే పెళ్ళాడతా సినిమాకి మన రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ సినిమాకి నాగార్జున సంతకం చేసి 3500 రూపాయల చెక్ ఇచ్చారట. ఇలాంటి సందర్భం గురించి క్రాక్ సినిమా సక్సస్ మీట్ లో పంచుకున్నాడు. అంటే రవితేజ కెరీర్ ఎంతమారిందో అందుకోసం ఎంత కష్టపడ్డాడో అర్థమవుతోంది.