రవితేజ క్రాక్ సినిమా విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారట ..!

రవితేజ క్రాక్ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి నమ్మకాన్ని నమ్మకం కలిగింది. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ అయినా మంచి వసూళ్ళు రాబడుతోంది. అంతేకాదు రవితేజ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా క్రాక్ నిలిచింది. ఇలాంటి సమయంలో క్రాక్ ఇంత పెద్ద హిట్ కావడం ఏ ఒక్కరు ఊహించలేదు. దాదాపు మూడేళ్ళ తర్వాత రవితేజ క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద 4 సినిమాలతో పోటీ పడి రవితేజ క్రాక్ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ తో అందరూ సక్సస్ ట్రాక్ లోకి వచ్చారు.

మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘క్రాక్’ 50 కోట్ల క్లబ్ లో చేరింది. కాగా ‘క్రాక్’ డిజిటల్ రైట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘ఆహా’ యాప్ ఫ్యాన్సీ రేట్ కి సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘క్రాక్’ సినిమాను జనవరి 29న ‘ఆహా’లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు. అంతేకాదు అఫీషియల్ గానూ ఈ విషయాన్ని వెల్లడించారు. కాని ‘క్రాక్’ సినిమా ప్రస్తుతం 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో కూడా భారీగా వసూళ్ళు రాబడుతోంది. దాంతో థియేటర్స్ రిలీజ్ లో మంచి వసూళ్ళు రాబడుతున్న ఈ సినిమా ఇప్పుడే ఓటీటీలో రిలీజ్ చేయకూడదని భావించిన అల్లు అరవింద్ థియేటర్లకు మద్దతిస్తూ ‘క్రాక్’ సినిమా డిజిటల్ రిలీజ్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో ‘ఆహా’ టీమ్ ‘క్రాక్’ విడుదలను ఫిబ్రవరి 5కు పోస్ట్ పోన్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇది అన్ని రకాలుగా మంచి నిర్ణయమే అయిన కూడా ఓటీటీలో చూడాలనుకున్న ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఇక క్రాక్ తో సక్సస్ ట్రాక్ ఎక్కిన దర్శకుడు గోపిచంద్ మలినేని కి వరసగా స్టార్ హీరోల నుంచి పిలుపొస్తున్నట్టు సమాచారం. నిర్మాతలు అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. ఏదేమైనా కరోనా కారణంగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ ఆశలు కల్పించింది రవితేజ క్రాక్. ఇక రవితేజ క్రాక్ తర్వాత ఖిలాడి సినిమాతో సెట్స్ మీదకి వచ్చాడు. ఈ సినిమాని సమ్మర్ వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.