Inah Canabarro Lucas: 116 ఏళ్ళు జీవించిన ప్రముఖ మహిళ కన్నుమూత

ప్రపంచంలో అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందిన బ్రెజిల్‌కు చెందిన సన్యాసిని కెనబారో లుకాస్ ఇక లేరు. 116 ఏళ్లు పూర్తిచేసుకున్న ఆమె, తన 117వ పుట్టినరోజు కోసం కేవలం నెల రోజుల దూరంలో ఉన్న వేళ మే 1న కన్నుమూశారు. బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్ ప్రాంతంలో 1908 జూన్ 8న జన్మించిన కెనబారో, నిండు జీవితాన్ని ఆధ్యాత్మికత, సామాజిక సేవతో గడిపారు. చివరికి వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో కాసెరోస్‌లోని శాంటా కాసా డి మిసెరికార్డియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఇరవై ఏళ్ల వయసులోనే ఆమె జీవితం సన్యాస మార్గంలోకి మళ్లింది. తన పరమ లక్ష్యంగా మానవసేవను ఎంచుకున్న కెనబారో, దాదాపు శతాబ్దానికి పైగా సంఘ సేవలో తనను తాను నిమగ్నం చేశారు. ఆమె జీవితంలో మరో విశేషం ఏమిటంటే ఫుట్‌బాల్‌ ఆటపై ఉన్న ప్రేమ. ప్రతి పుట్టినరోజును ఆమె ఒక ప్రత్యేక టీషర్టుతో జరుపుకునేది. ఫుట్‌బాల్ జెర్సీ వేసుకుని కెక్ కేక్ కట్ చేయడం, చిన్న వేడుక చేయడం ఆమెకు అలవాటుగా మారింది.

కెనబారో మృతితో అంతర్జాతీయంగా పలువురు ప్రముఖులు, బ్రెజిల్‌ సన్యాస సముదాయం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె జీవిత కథ అనేకమందికి స్ఫూర్తిగా నిలిచిందని వారు పేర్కొన్నారు. శతమానవ జీవితంలోనూ సాధారణ జీవితం, సామాజిక బాధ్యత, ఆధ్యాత్మిక తేజస్సు ఎలా సమపాళ్లలో కొనసాగించవచ్చో ఆమె చూపిన దృష్టాంతం మనసులను కదిలిస్తోంది. ఇక కెనబారో మృతితో, ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళగా ఇప్పుడు ఇంగ్లండ్‌కు చెందిన 115 ఏళ్ల ఈథెల్ కేటర్ నిలిచారు. అయితే కెనబారో లుకాస్ జీవితం మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

షర్మిలతో బాబుకు పనిలేదు || Journalist Bharadwaj Reaction On Ys Sharmila Arrest || Chandrababu || TR