సడెన్ గా “గుంటూరు కారం” పై ఫేక్ పాజిటివ్ పోస్టులు.. 

తెలుగు సినిమా ఎవెర్ గ్రీన్ సూపర్ చార్మింగ్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకడు. మరి తాను నటించిన తాజా చిత్రమే “గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ చిత్రం వారి కెరీర్ లో హ్యాట్రిక్ సినిమాగా రిలీజ్ కి రాగా ఈ సినిమా పై మొదటి రోజు నుంచే కాస్త డివైడ్ టాక్ తోనే సినిమా మొదలైంది.

దీనితో ఈ ఎఫెక్ట్ రెండో రోజు గట్టిగా కనిపించింది. మొదటి రోజే ఏకంగా 90 కోట్లకి పైగా గ్రాస్ వస్తే రెండో రోజు అది కేవలం 30 కోట్ల లోపే పడిపోయింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎందుకో గుంటూరు కారం పై భారీ ఎత్తున నెగిటివ్ టాక్ నడిచింది. సినిమా అస్సలు బాగాలేదని గురూజీ దెబ్బేసాడు అంటూ చాలా గట్టిగానే టాక్ సోషల్ మీడియాలో టాక్ వచ్చి వైరల్ అయ్యింది.

కానీ ఇపుడు ఎందుకో సడెన్ గా గుంటూరు కారం పై పాజిటివ్ పోస్ట్ లు ఎక్కువ దర్శనం ఇస్తున్నాయి. అయితే ఇది ఏమి కామన్ ఆడియెన్స్ కూడా చెప్పట్లేదు కొందరు సినీ ట్రాకర్స్ చెప్తున్నారు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే నిజానికి గుంటూరు కారం రేపటి నుంచి బుకింగ్స్ ఏమీ లేవు బుక్ మై షోలో కూడా అంతా గో గ్రీన్ నడుస్తుంది.

అయినా కూడా కావాలని గుంటూరు కారం పై ఫేక్ పాజిటివ్ పోస్ట్ లు చేయిస్తున్నారు. మరి ఇదంతా కావాలని చేయిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. మొత్తానికి సినిమాకి జనం రాకపోయినా సరే వస్తున్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు.