పుష్ప- 3 కూడా ఉందంటున్న ఫాహద్ ఫాజిల్..!

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప ఎంత మంచి సక్సెస్ అందుకుందో చూసాం. ఇక ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన, ఫాహద్ ఫాజిల్ తదితరులు నటించారు. ఇక ఈ సినిమా పార్ట్ 2 ఉంటుందన్న సంగతి కూడా తెలిసిందే. ఇక తాజాగా పార్ట్ 3 ఉంటుందని ఫహద్ ఫాజిల్ తెలిపాడు.

తనకు సుకుమార్ మొదట్లో ఈ సినిమా కథను చెప్పినప్పుడు ఒక పార్ట్ లోనే ఈ సినిమాను కంప్లీట్ చేయాలనుకున్నాడట. కానీ పోలీస్ స్టేషన్ సన్నివేశం చిత్రీకరించిన తర్వాత రెండు భాగాలుగా మారిందని అన్నాడు. ఇక ఈ మధ్య ఈ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు మూడో భాగానికి కూడా సిద్ధంగా ఉందని సుకుమార్ అన్నాడట. ఇక మూడో భాగానికి కావాల్సిన మెటీరియల్ కూడా తన వద్ద ఉందని క్లారిటీ ఇచ్చాడట.