రచనా బెనర్జీ గురించి మనందరికి తెలిసిందే. ఆమె ఒక సినిమా హీరోయిన్, వ్యాపారవేత్త ఇంకా టెలివిజన్ వ్యాఖ్యాత కూడా. ఆమె ఎన్నో సినిమాలు చేయడం జరిగింది. ఆమె బెంగాలీ, ఒడియా చిత్ర పరిశ్రమలలో తన రచనలకు ప్రసిద్ధి చెందింది. అనేక తెలుగు, తమిళంతో పాటుగా కన్నడ చిత్రాలలో కూడా కనిపించింది. ఆ సినిమాలు ఫ్యామిలీ ఆడీయన్స్ బాగానే ఆకట్టుకున్నాయి. దీనితో ఆమెకు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రచన ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేస్తూ వెండితెరకు దూరమయ్యింది.
అయితే ఆమె వ్యక్తిగత విషయాలను ఒకసారి చూస్తే ఆమె అక్టోబర్ రెండవ తేదీన 1974వ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించారు. ఆమె తల్లిదండ్రుల ఏకైక సంతానం. ఆమె తండ్రి ఉపమన్యు బెనర్జీ. ఆమె అసలు పేరు ఝుంఝుమ్ రాకేష్ బెనర్జీ అయితే ఆమెను రచన అని కూడా పిలుస్తారు. ఆమె తొలి చిత్రం అయిన డాన్ ప్రతిదాన్ దర్శకుడు సుఖేన్ దాస్ ద్వారా రచనగా తన పేరు మార్చబడింది. ఇకపోతే రచనా బెనర్జీ 2007లో ప్రోబల్ బసును వివాహం చేసుకుంది. వారికి ప్రోనిల్ బసు అనే కుమారుడు కూడా ఉన్నాడు.
బెనర్జీ 1994లో సౌత్ సిటీ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ కోర్సులో రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు మిస్ కలకత్తా పోటీలో గెలుపొందారు. ఆమె తన నటనా వృత్తిని ప్రారంభించే ముందు అనేక అందాల పోటీల్లోకి ప్రవేశించిడం జరిగింది. తరచూ ‘మిస్ బ్యూటిఫుల్ స్మైల్’గా ప్రకటించబడింది. 1994లో మధు సప్రే టైటిల్‌ను గెలుచుకున్న మిస్ ఇండియా పోటీ గ్రాండ్ ఫినాలే నుండి ఆమె తప్పుకుంది. రచనకు 1994వ సంవత్సరంలో మిస్ కోల్‌కతా కిరీటం పొందిన ఆమె మిస్ ఇండియా పోటీలో మిస్ బ్యూటిఫుల్ స్మైల్‌తో సహా భారతదేశంలో ఐదు అందాల పోటీలను కూడా గెలుచుకోవడం జరిగింది. అయితే సూర్యవంశం చిత్రంలో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించడం మరి ఆ కాలంలోని కల్ట్ సినిమాల్లో ఒకటి.
నటనతో పాటు బెనర్జీ జీ బంగ్లాలో ప్రసారమయ్యే ప్రముఖ బెంగాలీ నాన్-ఫిక్షన్ టీవీ షో అయిన దీదీ నంబర్ 1 ని కూడా హోస్ట్ చేశారు. ఏప్రిల్ ఐదు 2013లో టోలీగంజ్‌లోని దీదీ నెం. 1 స్టూడియోలో మంటలు చెలరేగాయి. ఆమె తీవ్ర భయాందోళనకు గురై స్పృహతప్పి పడిపోవడంతో ఆమెను వెంటనే నగర ఆసుపత్రికి (అరబిందో సేవా సదన్) తరలించారు.
ఆమెకు ఎన్నో కళాకర్ అవార్డులు, భారత్ నిర్మాణ్ అవార్డు, ఒడియా స్టేట్ ఫిల్మ్ అవార్డు, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంచే ప్రత్యేక చలనచిత్ర పురస్కారం, టెలి సమ్మాన్ అవార్డు, ETV Bangla Film Award, Zee Bangla Sonarసాంగ్సార్ అవార్డు 2015, ఇంకా దీదీ నంబర్ 1 & తుమీ జే అమర్ అనే ఎన్నో అవార్డులను ఆమె గెలుచుకోవడం జరిగింది. దానితో పాటుగానే ఒడిశా రాష్ట్ర చలనచిత్ర అవార్డు (స్పెషల్ జ్యూరీ) – సునా హరిణి (1999) అనే సినిమాకి మరి ఇంకోసారి ఉత్తమ నటిగా ఒడిశా రాష్ట్ర చలనచిత్ర పురస్కారం – మో కోలా తో జులానా (2001) అనే సినిమాకు ఆమె గెలుచుకోవడం కూడా జరిగింది.
అయితే ఇప్పుడు ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోల గురించి కామెంట్స్ చేయడం జరిగింది. ఆమె టాలీవుడ్ హీరోలతో చేసిన సినిమాల గురించి ఇంకా వాటి అనుభవాలను అందరితో పంచుకుంది. ఆమెను బాలయ్య బాబు గురించి అడిగినప్పుడు ఆయనకు కోపం ఎక్కువని చెప్పుకుని వచ్చింది. అలాగే రాయుడు సినిమాలో మోహన్ బాబుతో నటించడంపై స్పందించిన రచన ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని తప్పులు చేయకుండా ఉండాలని తెలిపారు. ఆయనతో నటించడం ఆమెకు పెద్దగా ఇష్టం లేదని కూడా చెప్పుకుంటూ వచ్చింది రచన.
ఇంకా ఈ జనరేషన్ హీరోల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చింది. జూ. ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని అతని డాన్సులు సూపర్ గా ఉంటాయని చాలా బాగా చేస్తాడని చెప్పడం జరిగింది. అలాగే పుష్పా సినిమాతో దేశమంతా క్రేజ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ గురించి తగ్గేదే లే అంటూ జవాబు ఇచ్చింది. ఆమెకు రామ్ చరణ్ తో కలిసి నటించాలని ఉందని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆమెకు రామ్ చరణ్ నటనంటే చాలా ఇష్టమని చెప్పుకుంటూ వచ్చింది. ఇంకా ఆమె ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాలను, అభిప్రాయాలను కూడా వెల్లడించింది.
మరి ఇప్పుడు ఆమె టీవీ షోలతో బిజీ ఉన్నట్టు ఇంకా వేరే వినోద కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టు తెలిపారు. ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలియజేశారు.