ఎఫ్-2 ..ఫన్ అండ్ ఫ్రస్టేషన్. గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్దకి ఓ చిన్న సినిమాగా వచ్చి ఆ ఏడాది బిగెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా నిలిచింది. వెంకీ కెరియర్ లో మరో మైలురాయిగా నిలిచిన చిత్రం ఈ ఎఫ్-2. వెంకటేష్ , వరుణ్ తేజ్‌లు హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఎఫ్-2 మంచి విజయం సాధించింది.
దానికి కొనసాగింపుగా అదే టీమ్ ‘ఎఫ్-3’ పేరిట మరో సినిమాను నిర్మించడానికి తలపెట్టగా, ఈ ఉదయం ముహూర్తాన్ని నిర్ణయించి, షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు.సినిమా రెగ్యులర్ షూటింగును 23 నుంచి ప్రారంభించనున్నామని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
తమ వద్ద మరింత ఫన్, ఫ్రస్ట్రేషన్ ఉందని, మరింత వినోదానికి సిద్ధంగా ఉండాలని వెల్లడించింది. ఇక ముహూర్తపు షాట్ ను వరుణ్ తేజ్, తమన్నాలపై అల్లు అరవింద్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఎఫ్ 2కు నిర్మాతగా వ్యవహరించిన నిర్మాత దిల్‌రాజు ‘ఎఫ్ 3’ని కూడా నిర్మించనున్నారు.