F3 poster release : ఫ్రస్ట్రేషన్ వదిలేసి ఫన్ తో పండుగకు వచ్చేసిన ఎఫ్ 3… పోస్టర్ అదిరింది..!

F3 poster release : వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ధమాకా సినిమా f2. ఈ సినిమా చేసిన సందడి అంత ఇంత కాదు. పెళ్ళాలు పెట్టే టార్చర్ కూ ఫ్రస్ట్రేట్ అయ్యే మొగుళ్లుగా వెంకటేష్ వరుణ్ ల నటన నవ్వులు పూయించింది. సినిమా మొత్తం వెంకీ, వరుణ లా కామెడీ మరియు రాజేంద్రప్రసాద్ కూడా తోడవడంతో మరింత ఫన్ సినిమాకి యాడ్ అయిందనే చెప్పాలి. ఇక వెంకీకి జోడిగా తమన్నా, వరుణ్ కి జోడిగా మెహరిన్ నటన ఆకట్టుకుంది.

ఇక ఈ చిత్రం సాలిడ్ హిట్ అందుకోవడంతో ఈ సినిమా కూ సీక్వేల్ ప్లాన్ చేసాడు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి. F3 పేరుతో సినిమాను తీస్తున్నారు మరోసారి వెంకీ వరుణ్ లతో ఫన్ పటాకా తీస్తున్నాడు అనిల్.ఉగాది సందర్బంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంది.

ప్రతి ఒక్కరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని తెలుపుతూ.. సినిమాలోని ప్రధాన తారాగణంతో కూడిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఎఫ్‌2’లో ‘భార్య బాధితులు’గా కనిపించిన వెంకటేష్, వరుణ్ తేజ్.. ఈ పోస్టర్‌లో చేతిలో మెగాఫోన్‌లు పట్టుకుని వారిని భయపెట్టడం ఆసక్తిని సంతరించుకుంది. రాజేంద్ర ప్రసాద్.. వెంకటేష్, వరుణ్ తేజ్‌తో ఉండగా, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్, సునీల్, వెన్నెల కిషోర్ మరియు ఇతరులు మరొక వైపు ఉన్నారు. పోస్టర్‌లో పండగ వాతావరణం కనబడుతోంది. మే 27న థియేటర్లలో నవ్వుల హంగామా చేయడానికి ‘ఎఫ్3’ కుటుంబం సిద్ధంగా ఉన్నట్లుగా ఈ పోస్టర్‌తో తెలిసిపోతోంది.

ఇక ఈ సినిమా నుండి విడుదలైన మొదటి పాట నుండి ప్రొమోషనల్ కంటెంట్ కూ మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా కూ సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించగా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్నారు దిల్ రాజు ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహారిస్తున్నారు.