‘యానిమల్‌’ విడుదలపై ఉత్కంఠ… భారీ కలెక్షన్లపై మేకర్స్‌ దృష్టి!

‘యానిమల్‌’ సినిమా విడుదలకు ఇంకా ఎంతో సమయం లేదు. విదేశాల్లో ప్రీమియర్‌ షోలు మరికొన్ని గంటల్లో పడతాయి. ’అర్జున్‌ రెడ్డి’, ’కబీర్‌ సింగ్‌’ తర్వాత సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సినిమా కావడం, టీజర్‌ ట్రైలర్‌లలో యాక్షన్‌ డోస్‌ ప్రేక్షకులను అట్టాక్ట్‌ చేయడంతో సినిమాపై విపరీతమైన బజ్‌ నెలకొంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా జోరుగా సాగుతున్నాయి.

మరి, సినిమా ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎలా ఉంటాయన్నదానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రణబీర్‌ కపూర్‌ కెరీర్‌ చూస్తే… ’సంజు’, ’బ్రహ్మాస్త్ర’ వంటి భారీ విజయాలు ఉన్నాయి. అయితే… అవి మాస్‌ ఫిలిమ్స్‌ కావు. కంటెంట్‌ బేస్డ్‌ క్లాస్‌ ఫిలిమ్స్‌. ’యానిమల్‌’కు వస్తే అవుట్‌ అండ్‌ అవుట్‌ సందీప్‌ రెడ్డి వంగా స్టైల్‌ కమర్షియల్‌ ఫిల్మ్‌. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాల్లో సినిమాలో మాంచి మాస్‌ కంటెంట్‌ ఉందని ప్రేక్షకుల్లో నమ్మకం కలిగింది. అందుకు తగ్గట్లు బుకింగ్స్‌ బాగా జరుగుతున్నాయి.

’యానిమల్‌’ హిందీ వెర్షన్‌ షోస్‌ ద్వారా 50 నుంచి 55 కోట్ల రూపాయల గ్రాస్‌ రావచ్చని ఓ అంచనా. మాస్‌ సినిమాలకు సింగిల్‌ స్కీన్ర్‌ థియేటర్లలో బుకింగ్స్‌ బావుంటాయి. ’యానిమల్‌’కు మల్టీప్లెక్స్‌ థియేటర్లలో సైతం బావున్నాయి. పీవీఆర్‌, ఐనాక్స్‌ స్కీన్లల్రో రెండున్నర లక్షల టికెట్స్‌ అమ్మారు. కేవలం వాటి ద్వారా సుమారు ఏడున్నర కోట్ల వరకు వచ్చాయి. ంధప్రదేశ్‌, తెలంగాణ… రెండు తెలుగు రాష్టాల్లో సైతం ’యానిమల్‌’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ బావున్నాయి. తెలుగులో మొదటి రోజు పది కోట్ల రూపాయలు రావచ్చని ఓ అంచనా. ఒక్క హైదరాబాద్‌ సిటీలో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఉంటాయని టాక్‌.