కీర్తి సురేష్ ని చూడాలనుకుంది అలానే కదా..రెడీగా ఉండండి..!

కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. కమర్షియల్ సినిమాలు.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కొన్ని తనకోసమే ప్రత్యేకగా వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇక కీర్తి కూడా కథ నచ్చితే ఎంత రిస్క్ అయినా చేస్తుంది..ఎలాంటి ప్రయోగం చేయాలన్నా సిద్దంగా ఉంటుంది. ఇప్పటికే అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ లో నటించి దేశ వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించుకుంది. అంతేకాదు కీర్తి కి ఈ సినిమా తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఊహించని విధంగా పెరిగింది.

5 unforgettable moments from Mahanati - Movies News

ఇక పెంగ్విన్ సినిమా రిలీజవగా గుడ్ లక్ సఖీ, మిస్ ఇండియా సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇన్నాళ్ళు ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న టాక్ ఉన్నప్పటికి త్వరలో థియోటర్స్ ఓపెన్ అవుతాయని చెబుతుండటంతో ఇక కీర్తి సినిమాలు థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. పెంగ్విన్ ఒక్కటే ఓటీటీలో రిలీజైనప్పటి నుంచి కీర్తి ని ఓటీటీ హీరోయిన్ అన్న కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాని తనలాగా మేకర్స్ కి సపోర్ట్ చేసే హీరోయిన్స్ ఎంతమంది.. అన్న రివర్స్ పంచ్ లు కూడా ఫ్యాన్స్ నుంచి పడ్డాయి.

Rang De: First look motion poster unveiled on the eve of Nithiin's birthday  | Telugu Movie News - Times of India

కాగా కీర్తి సురేష్ ని రొమాంటిక్ సినిమాలలో చూడాలని యంగ్ హీరోల సినిమాలలో నటిస్తే చూడాలన్న ఉత్సాహం అభిమానుల్లో ఉంది. ఇప్పటికే టాలీవుడ్ లో రాం, నాని లతో సినిమాలు చేసినప్పటికి కీర్తి ని మంచి లవ్ అండ్ రొమాటిక్ ఎంటర్‌టైనర్ లో చూడాలేదు. అయితే నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న” రంగ్ దే ” సినిమా ఆ తరహా సినిమానే అని సమాచారం. ఇన్నాళ్ళు ప్రేక్షకులు, అభిమానులు కీర్తి సురేష్ ని ఎలా అయితే చూడాలనుకున్నారో అలానే కనిపించబోతుందట. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ అందరికీ బాగానే ఆకట్టుకుంది.