చీరలో ఈషా రెబ్బ.. అందం అదిరిందబ్బ.. వైరల్ పిక్స్

Eesha Rebba Special Pics On Dussehra

బాపు గీసిన బొమ్మ, పదహరణాల తెలుగమ్మాయి అనే మాటలు నిత్యం వింటూ ఉంటాం. ఓ అమ్మాయిని పొగడాలన్నా, అందాన్నా ఆరాధించాలన్న ఈ పదాలను కచ్చితంగా వాడతారు. కానీ అవి అందరికీ సరిపోవు. కొందరికి మాత్రమే కరెక్ట్‌గా సూట్ అవుతాయి. ఆ కొందరిలో ఈషా రెబ్బ ఒకరు. ఈషా రెబ్బకు అందం ఆకాశమంతా ఉంది. అయితే అంతే స్థాయిలో అదృష్టం లేకపోవడంతో ఆమె అందానికి సరైన గుర్తింపు రావడం లేదు.

ఎన్ని సినిమాలు చేసినా స్టార్ స్టేటస్ మాత్రం రావడం లేదు. అయితే ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చేది. ఇప్పుడు హీరోయిన్‌గా అవకాశాలు బాగానే వస్తున్నాయి. కానీ ఈషా రెబ్బకు దక్కాల్సిన గుర్తింపు మాత్రం దక్కడం లేదనిపిస్తోంది. వెండితెరపై ఆమె సక్సెస్ రేటు ఎలా ఉన్నాగానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె రేంజ్ వేరే లెవెల్. సోషల్ మీడియాలో ఈషా రెబ్బ షేర్ చేసే ఫోటోల కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు.

Eesha Rebba Special Pics On Dussehra
Eesha Rebba Special Pics On Dussehra

చందమామ లాంటి మోము, వెన్నెల కురిసినట్టు ఆ చిరు దరహాసం ఈషా రెబ్బకు అదనపు హంగులు. ఈషా రెబ్బ చీరకట్టినా మోడ్రన్ డ్రెస్సులు ధరించినా తనకు తానేసాటి. దసరా సందర్భంగా చీరకట్టుతో కుర్రాకారును ఉక్కిరిబిక్కిరి చేసేసింది. విజయ దశమి శుభాకాంక్షలు చెబుతూ ఆమె షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. పింక్ సారీలో ఈషా రెబ్బ అందాలు చూడటానికి రెండు కళ్లు చాలడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Eesha Rebba Special Pics On Dussehra
Eesha Rebba Special Pics On Dussehra