ఆ పొలిటీషయన్‌తో రిలేషన్ షిప్.. ఈషారెబ్బా యవ్వారం మాములుగా లేదు!!

Eesha Rebba Birthday Wishes To Rajeev Reddy

తెలుగు అమ్మాయిలు అందానికి ప్రతీక, పదహారణాల తెలుగు అమ్మాయి, బాపు గీసిన బొమ్మ అని ఇలా ఎన్ని రకాలు చెప్పినా.. అవి ఈషా రెబ్బాకు కచ్చితంగా సరిపోతాయి. చిన్న చిన్న పాత్రలతో వెండితెరపై మెల్లిగా ఎదుగుతూ వచ్చిన ఈషా.. స్టార్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. సైడ్ క్యారెక్టర్స్ నుంచి సోలో హీరోయిన్‌గా ఎదిగింది. ఇక సోషల్ మీడియాలో ఈషా చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే.

Eesha Rebba Birthday Wishes To Rajeev Reddy
Eesha Rebba Birthday Wishes To Rajeev Reddy

మోడ్రస్ డ్రెస్సులో ఈషా రెబ్బా ఎంత అందంగా ఉంటుందే.. దానికి వంద రెట్లు చీరలో అందంగా ఉంటుంది. ఇక ఈషా చేసే ఫోటో షూట్లకు ఫిదాకానీ వారెవ్వరూ ఉండరు. ఈషా అందానికి సాధారణ నెటిజన్లు సైతం కవిత్వాలు రాస్తుంటారు. ఇక ఆ వర్ణణలను చూసి ఈషా లైక్ చేయడమో, కామెంట్ పెట్టడం వంటివో చేస్తూ ఉంటుంది. అయితే ఎలాంటి రూమర్స్, గాసిప్స్, రిలేషన్ షిప్స్ లేకుండా క్లీన్‌గా ఉండే ఈషా.. తాజాగా చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

‘అద్భుతమైన వ్యక్తి రాజీవ్ రెడ్డికి హ్యాపీ బర్త్ డే. ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం ప్రేమ, సంతోషాన్ని పొందడానికి నీకు అర్హత ఉంది. అంతేకాకుండా నీవు కోరుకునే, సాధించాలని పోరాడే ప్రతీ విషయాన్ని పొందగలవు’ అంటూ ఈషా ఓ ఫోటోను షేర్ చేసింది. ఇక ఇందులో అతను షర్ట్ లేకుండా ఉండటం, ఆ లొకేషన్ చూస్తుంటే.. ఈషా యవ్వారం మామూలుగా లేదని నెటిజన్స కామెంట్స్ చేస్తున్నారు.