సోలో రిలీజ్.! ‘ఈగిల్’ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.!

పోటీగా మూడు పెద్ద సినిమాలు వుండడంతో చిన్న సినిమా ‘హనుమాన్’ థియేటర్లు దొరక్క తొలుత విలవిల్లాడింది. కానీ, ఆ ‘హనుమాన్’ సూపర్ హిట్ అవడంతో, ఆ ఓవర్ ఫ్లోస్‌ని మిగిలిన మూడు పెద్ద సినిమాలు పంచుకోవాల్సి వచ్చింది.

కంటెంట్ బావుంటే.. ఇదీ పరిస్థితి.! ‘ఈగిల్’ సినిమా పరిస్థితేంటి.? ఫిబ్రవరి 9న సోలో రిలీజ్.. అని చెప్పుకుంది ‘ఈగిల్’. అలాగని మాటిస్తేనే, ‘ఈగిల్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది మరి.! హామీ ఇచ్చింది దిల్ రాజు సహా పరిశ్రమకు చెందిన పలువురు పెద్దలు.

ఇప్పుడేమో, ‘ఫిబ్రవరి 9’వ తేదీకి పలు సినిమాలు క్యూ కడుతున్నాయ్. దాంతో, ‘ఈగిల్’ టీమ్ ఆందోళన చెందుతోంది. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటూ చిత్ర నిర్మాణ సంస్థ, నిర్మాతల మండలికి, ఛాంబర్‌కి లేఖ కూడా రాసింది.

‘హనుమాన్’ పలితం చూశాక కూడా, ఈ సోలో రిలీజ్ గోలేంటో.! ‘ఈగిల్’ బావుంటే, పక్కన ఏ సినిమా వున్నా పెద్దగా నష్టం వుండదు కదా.? అంతిమంగా ఇది జస్ట్ బిజినెస్. ఎవరి భయాలు వాళ్ళకి వుంటాయ్. ‘ఈగిల్’ అంతలా భయపడుతోందంటే, కంటెంట్ విషయంలో ఏమన్నా డౌట్లున్నాయా.?