‘ఈగల్’ కింగ్‌ వీడియో అదుర్స్‌!?

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో అలరించేందుకు రెడీగా ఉంటాడు టాలీవుడ్‌ మాస్‌ హీరో మాస్‌ మాహరాజా రవితేజ. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌.. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ కూడా చేస్తుంటారు.

ఇక గతేడాది వరుసగా హిట్స్‌ అందుకున్న రవితేజ తాజాగా ‘ఈగల్‌’ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈమూవీ నుంచి విడుదలైన పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌ మూవీపై మరింత హైప్ ని చేశాయి.

ఫిబ్రవరి 9న ఈ మూవీ అడియన్స్‌ ముందుకు రానున్న క్రమంలో.. ఈగల్‌ మూవీ నుంచి మేకింగ్‌ వీడియో రిలీజ్‌ అయింది. ఆ వీడియో ఇప్పుడు అంతటా హాట్‌ టాపిక్‌ అవుతోంది. ఈగల్‌ నుంచి రీసెంట్గా రిలీజ్‌ అయిన మేకింగ్‌ వీడియో.. సినిమా పై విపరీతంగా అంచనాలను పెంచేదిగా ఉంది. ఇంకా చెప్పాలంటే.. టీజర్‌, ట్రైలర్‌ ను మించిపోయి మరింత క్యూరియాసిటిని కలిగిస్తోంది. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌, విజువల్స్‌ అదిరిపోయాయి. దీంతో ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌ లో ట్రెండ్‌ అవుతోంది.

The Making Of #Eagle | Ravi Teja | Kavya Thapar | Anupama P | Karthik Gattamneni | PMF