Home Entertainment "ఆచార్య" టీజర్ వచ్చేసింది ... చరణ్ వాయిస్ , చిరు ఫోర్ఫామెన్స్ !

“ఆచార్య” టీజర్ వచ్చేసింది … చరణ్ వాయిస్ , చిరు ఫోర్ఫామెన్స్ !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. ఈ భారీ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ , కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా  నిర్మాణం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎప్పటి నుంచో తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం నుంచి టీజర్ కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు.

Producers Spend A Lot Of Money For Chiranjeevi'S Intro Song In Acharya Movie
megastar’s “acharya”

టీజర్ విషయానికొస్తే .. ఆచార్య టీజర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది. ఇతరుల కోసం పనిచేసే వారు దైవం తో సమానం, అలాంటి వారి జీవితాలే ప్రమాదం లో పడితే ,ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు అంటూ రామ్ చరణ్ డైలాగ్ చెప్తుంటే మెగాస్టార్ చేతికి ఎర్ర గుడ్డ చుట్టుకొని , కత్తి పట్టి శత్రువులపై కొదమసింహంలా విరుచుకుపడుతున్నారు. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా .. అందరూ నన్ను ఆచార్య అని పిలుస్తుంటారు .. బహుశా గుణపాఠాలు చెప్తేననేమో అంటూ మెగాస్టార్ చెప్పే డైలాగ్ ఒక్కటి చాలు సినిమా ఎలా ఉంటుందో చెప్పడానికి ..ఆచార్య దేవో భవా అంటూ టీజర్ ను ఎండ్ చేసింది చిత్ర యూనిట్ .. మొత్తంగా మెగాస్టార్ లుక్ వావ్ అనిపించేలా ఉంది. ఇక చివర్లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేయకపోయినా కూడా సమ్మర్ లో ఆచార్య రిలీజ్ కాబోతుంది అంటూ ఓ చిన్న హింట్ ఇచ్చారు. 

ఆచార్య చిత్రాన్ని కొరటాల శివ.. ధర్మస్థలి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇందులో దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో నటిస్తున్నట్లు అర్థమవుతోంది. దేవాలయాలు కొందరి కబంధ హస్తాల్లో పడి ఎలా చారిత్రకకు కోల్పోతున్నాయి. దీనికి ఆచార్య ఎలాంటి ముగింపు పలకిడానేదే ఈ సినిమా కథాశంగా తెలుస్తోంది.

మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్, తిరు సినిమాటోగ్రఫీ, మణిశర్య బ్యాగ్రౌండ్ స్కోర్, కొరటాల టేకింగ్, డైలాగ్స్ అన్నీ పక్కాగా హైలెట్ అయ్యాయి.. చిరు లుక్, డైలాగ్ డెలివరీ మెగాభిమానులకు ఊపునిస్తున్నాయి..

- Advertisement -

Related Posts

ఈ నెల సినిమాలకు కష్టాలు తప్పవన్నమాట

కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటుతోంది. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాలు సినిమా హాళ్లను మూసివేస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే తెలుగు...

పవర్ స్టార్ స్టామినా.. ‘వకీల్ సాబ్’ వసూళ్ల వరద

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్' మొదటిరోజును పూర్తి చేసుకుంది. ప్రభుత్వం ఆంక్షలు, కోవిడ్ భయాందోళనల నడుమ థియేటర్లలోకి అడుగుపెట్టిన 'వకీల్ సాబ్' దాదాపు నార్మల్ రోజుల్లో...

వకీల్ కోసం చిరు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చుగా

ఏపీ ప్రభుత్వానికి, 'వకీల్ సాబ్' డిస్ట్రిబ్యూటర్లకు నడుమ టికెట్ ధరల విషయమై రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదటి మూడు రోజులు టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు లేకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది....

Latest News