రక్త దానం చేయండి, ప్రాణదాతలు కండి .. రిపబ్లిక్ డే రోజు చిరు పిలుపు

మెగాస్టార్ నే కాద‌న్నంత మ‌గాడా?

దేశ వ్యాప్తంగా 72 వ గణ‌తంత్ర దినోత్స‌వ వేడుకలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. దేశంలోని ప్ర‌తి ఒక్క‌రు ఈ వేడుక‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. సెల‌బ్రిటీలు త‌మ సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దేశ ప్ర‌జ‌లంద‌ర‌కి, మెగా అభిమానుల‌కు, ఆత్మీయులంద‌రికి 72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుబాకాంక్ష‌లు తెలిపారు.

Acharya First Look And Motion Poster

రిప‌బ్లిక్ డే సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని విస్తృతంగా రక్త‌దానం చేయ‌సంక‌ల్పించిన మెగా బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్‌ని మ‌న‌స్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా పిలుపు మేర‌కు స్పందించి, చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ ‌కు వ‌చ్చి, ర‌క్త‌దానం చేసిన‌, చేస్తున్న రక్త‌దాక్త‌ల‌కు హృద‌య పూర్వక ధ‌న్య‌వాదాలు. ర‌క్త దానం చేయండి, ప్రాణ దాత‌లు కండి అంటూ చిరంజీవి త‌న వాయిస్ వీడియో ద్వారా సందేశాన్ని అందించారు.

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చందమామ కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు.