కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెలుగు, తమిళ్ భాషలలో చేసిన ద్విభాషా చిత్రం కస్టడీ. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అరవింద్ స్వామి విలన్ గా కనిపించనున్నాడు. కమర్షియల్ థ్రిల్లర్ గా ఈ మూవీని వెంకట్ ప్రభు ఆవిష్కరించారు. నాగ చైతన్య మొదటిసారి ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తూ ఉండటం విశేషం.
ఇదిలా ఉంటే మే 12న ఈ సినిమా రెండు భాషలలో రిలీజ్ అవుతోంది. నాగ చైతన్య మూవీ కావడంతో ఈ సినిమాపై తెలుగునాట బజ్ భాగానే ఉంది. అతని మార్కెట్ వేల్యూకి తగ్గట్లుగానే బిజినెస్ కూడా జరిగిందని చెప్పాలి. అయితే తమిళంలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో బజ్ లేదు.
తమిళంలో వెంకట్ ప్రభు స్టార్ డైరెక్టర్, అలాగే ఇళయరాజా, యువన్ శంకర్ రాజా తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్, అరవింద్ స్వామి కోలీవుడ్ స్టార్ యాక్టర్. ఇన్ని కాంబినేషన్స్ కూడా ఈ సినిమాగా తమిళంలో పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. కేవలం వంద థియేటర్స్ వరకు మాత్రమే దొరికాయి. అలాగే 2.50 కోట్ల బ్రేక్ ఎవెన్ తో రిలీజ్ అవుతోంది.
కోలీవుడ్ లో ఓ చిన్న సినిమాకి ఏ స్థాయిలో బిజినెస్ జరుగుతుందో అంతే వ్యాపారం కస్టడీకి జరిగింది. వెంకట్ ప్రభు కస్టడీ డబ్బింగ్ మూవీ కాదు అని ఎంతగా చెప్పినా కూడా అక్కడి మీడియా మాత్రం పెద్దగా ప్రమోట్ చేయలేదని చెప్పాలి.అలాగే డబ్బింగ్ చిత్రంగానే ప్రాజెక్ట్ చేస్తూ వస్తోంది. ఇక తెలుగులో మాత్రం ఈ మూవీకి భాగానే థియేటర్స్ దొరికాయి.
నైజాం లో 195, సీడెడ్ లో 100, ఆంధ్రాలో 250+, కర్ణాటకలో రెస్ట్ ఆఫ్ ఇండియాలో 150+, ఓవర్సీస్ లో 180 థియేటర్స్ కలిపితే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 875+ స్క్రీన్స్ లో కస్టడీ తెలుగు వెర్షన్ రిలీజ్ అవుతూ ఉండటం విశేషం. తెలుగులో ఈ సినిమా 22.50 కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ తో రిలీజ్ కాబోతోంది. రెండు భాషలలో కలిసి 25 కోట్లు కలెక్ట్ చేస్తే కస్టడీ క్లీన్ హిట్ గా నిపిస్తుంది. మరి ఈ సినిమా ఏ మేరకు చైతూకి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.